నితిన్‌తో ఇస్మార్ట్ బ్యూటీ..

by Shyam |
నితిన్‌తో ఇస్మార్ట్ బ్యూటీ..
X

యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది భీష్మ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. చాలా ఫెయిల్యూర్స్ తర్వాత మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కిన నితిన్.. కీర్తి సురేశ్‌తో రంగ్‌దే, పవర్ పేట సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు అదే ఊపులో హిందీ చిత్రం ‘అందాధున్’ రీమేక్ కూడా లాంచ్ చేశాడు. కాగా ఈ చిత్రంలో టబు చేసిన పాత్రకు శిల్పాశెట్టి ఆల్మోస్ట్ కన్‌ఫర్మ్ కాగా.. హీరోయిన్ విషయంలో చాలా పేర్లే వినిపిస్తున్నాయి. ముందుగా నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ప్రియాంక మోహన్ చేస్తుందని రూమర్లు వినిపించగా.. ఇప్పుడు మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది.

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిపోయిన నభా నటేశ్.. ఈ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉండగా, ప్రస్తుతం నభా నటేష్.. బెల్లంకొండ శ్రీనివాస్, సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనూ నటిస్తోంది.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న అంధాధున్ రీమేక్‌ను శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తుండగా.. తెలుగు స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేశాడట దర్శకుడు. నితిన్ రంగ్‌దే, పవర్ పేట చిత్రాలు పూర్తి కాగానే ఈ చిత్రం పట్టాలెక్కనుందట.

Advertisement

Next Story