నికాన్ ఫ్రీ ఆన్‌లైన్ ఫొటోగ్రఫీ కోర్స్

by Shyam |
నికాన్ ఫ్రీ ఆన్‌లైన్ ఫొటోగ్రఫీ కోర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘విరబూసిన పువ్వును, రాలిపడిన విరులను, ఊయలూగే వరిచేలును, ఉరకలేసే ఆవుదూడను, జారిపడుతున్న జలపాతాన్ని, జామురాతిరి జాబిలమ్మను’ చూడగానే ఓ ఫొటో తీయాలని మనసు ఉవ్విళ్లూరుతుంది. సెల్‌ఫోన్‌లో లేదా కెమెరాలో ఫొటోలు అందరూ తీస్తారు. కానీ ఆ ఫొటో తీయడంలో కాస్త ప్రత్యేకత ఉంటే, ఆ బొమ్మకు ప్రాణం రావడంతో పాటు పదిమంది అభినందనలు వస్తుంటాయి. అందుకే ప్రొఫెషనల్స్ తీసే ఫొటోలకు అంతగా ఫిదా అయిపోతాం. ఫొటోగ్రఫీలో కళాత్మకత ఉట్టిపడాలంటే దానికి ఓ ఎడ్యుకేషన్ కావాలి. కానీ అందుకు కాస్త డబ్బులు ఖర్చు చేయాలి. మరి అందరూ డబ్బులు పెట్టలేరు, కానీ నేర్చుకోవాలని తపన మాత్రం చాలామందికి ఉంటుంది. నికాన్ ఆ కోరిక తీర్చనుంది. టాప్ ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్‌తో ఫ్రీ ఆన్‌లైన్ కోర్సులు అందించనుంది. ఇంకెందుకు ఆలస్యం.. క్లిక్ స్మైల్స్.

ఫొటోగ్రఫీ నేర్చుకోవాలనుకునే ఉత్సాహవంతుల కోసం నికాన్ హాలీడేస్ ఆన్‌లైన్ ఆఫర్ తీసుకొచ్చింది. నవంబర్ 23 నుంచి డిసెంబర్ 31 వరకు నికాన్ అందిస్తున్న ఈ ఫొటోగ్రఫీ క్లాసులను ఉచితంగా స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. ఇందుకోసం మన పేరు, ఈమెయిల్ అడ్రస్‌తో సైన్‌అప్ కావాల్సి ఉంటుంది. ‘హాలీడే‌స్ అంటేనే జ్ఞాపకాల మూట. ఇకపై నికాన్‌తో వాటిని క్యాప్చర్ చేయండి. ఇన్‌సైడర్ టిప్స్, టెక్నికల్ అడ్వైస్, కొత్త ఐడియాలు, క్రియేటివ్ టెక్నిక్స్ అన్నీ మీకోసమే. బెస్ట్ హాలీడే షాట్స్ తీయడానికి మా వంతు సాయం అందిస్తున్నాం’ అని నికాన్ చెబుతోంది.

ఫొటోగ్రఫీలోని భిన్నమైన సబ్జెక్ట్స్‌ల మీద ఇన్‌డెప్త్ లెస్సన్స్ చెప్పేందుకు ఎక్స్‌పర్ట్స్ సాధారణంగా ఒక్కో క్లాసుకు 15 డాలర్లు నుంచి 50 డాలర్ల వరకు చార్జ్ చేస్తారు. అయితే నికాన్ ఈ కోర్సుతో పాటు 10 ఒరిజనల్ క్లాసెస్ కూడా అందిస్తోంది. దీనికి ‘బెటర్ హాలీడే ఫొటోస్ విత్ నికాన్ అంబాసిడర్స్’ అనే పేరు పెట్టింది.

నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నోళ్లు ‘నికాన్ స్కూల్ ఆన్‌లైన్’ (Nikon School Online)లో రిజిస్టర్ చేసుకోవాలి. లాక్‌డౌన్ టైమ్(ఏప్రిల్ నెల)లోనూ నికాన్ ఈ తరహా ఫ్రీ కోర్సు అందించగా, అనూహ్య స్పందన వచ్చింది. దాంతో మరోసారి ఈ కోర్సును ఫ్రీగా అందిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed