యువతిని బీర్ సీసాతో పొడవడంతో….

by Shyam |

దిశ, వరంగల్: ప్రేమోన్మాదులకు చట్ట ప్రకారం శిక్షలు విధిస్తున్నా ఏదో ఓ చోట అమ్మాయిల ప్రాణాలను తీస్తూనే ఉన్నారు. ప్రేమించకుంటే యాసిడ్ పోయడం, పెళ్లికి ఒప్పుకోకుంటే కత్తులతో దాడులు చేస్తూ నిత్యం అలజడులు సృష్టిస్తూనే ఉన్నారు. కొన్నినెలల క్రితం వరంగల్ జిల్లాలో యువతి హత్య విషయం మరువక ముందే జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం అర్బన్ జిల్లాకేంద్రంలోని లేబర్ కాలనీలో తాను ప్రేమించి యువతి కొద్దిరోజులుగా దూరం పెడుతుందన్న ఆగ్రహంతో నిఖిల్ అనే యువకుడు విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. తనను ప్రేమించాలంటూ యువతితో వాగ్వాదానికి దిగి… ఒక్కసారిగా బీరు సీసాతో దాడి చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని గమనించిన స్థానికులు యువతిని వెంటనే ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story