ఆన్‌లైన్ కిరాణా అమ్మకాలు 134 శాతం వృద్ధి

by Harish |   ( Updated:2021-08-13 06:48:12.0  )
ఆన్‌లైన్ కిరాణా అమ్మకాలు 134 శాతం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కొవిడ్ మహమ్మారి పరిణామాల తర్వాత ఎఫ్ఎంసీజీ, ఈ-కామర్స్ కంపెనీలు భారీగా వృద్ధి సాధించాయి. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు, కఠిన నిబంధనలతో ఆన్‌లైన్ కిరాణా స్టోర్లకు ప్రయోజనాలు లభించాయి. ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితులతో ఆన్‌లైన్ కొనుగోళ్లపై ఆసక్తి చూపించారు. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో కిరాణా సరుకుల విక్రయాలు రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ నిల్సన్ఐక్యూ వెల్లడించింది. 2020 వరకు ఈ-కామర్స్ అమ్మకాలు 96 శాతంగా నమోదవగా, ఆ తర్వాత ఏకంగా 134 శాతం పెరిగాయి.

దేశీయంగా ప్రధాన 52 మెట్రో నగరాల నుంచి సేకరించిన వివరాల ప్రకారం మే నెలలో ఈ-కామర్స్ రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థల అమ్మకాల్లో మారికో 9 శాతం, హిందూస్తాన్ యూనిలీవర్ 6 శాతం వృద్ధిని సాధించాయి. భౌతికంగా కిరాణా స్టోర్ల అమ్మకాలు దారుణంగా పతనమైనప్పటికీ ఆన్‌లైన్ ద్వారా కొనుగోళ్లు పెరిగాయని నిల్సన్ఐక్యూ తెలిపింది. రానున్న రోజుల్లో ఎఫ్ఎంసీజీ కంపెనీల ఆన్‌లైన్ విక్రయాలు మరింత పెరుగుతాయని సంస్థ కస్టమర్ సక్సెస్ విభాగానికి చెందిన సమీర్ శుక్రా వెల్లడించారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed