బయోపిక్‌లో శివానీ రాజశేఖర్.. ఈ సినిమా అయినా మలుపు తిప్పుతుందా..?

by sudharani |   ( Updated:2025-04-04 11:52:42.0  )
బయోపిక్‌లో శివానీ రాజశేఖర్.. ఈ సినిమా అయినా మలుపు తిప్పుతుందా..?
X

దిశ, సినిమా: నటుడు మాధవన్ (Madhavan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జి.డి.ఎన్’(GDN). ప్రముఖ శాస్త్రవేత్త జి.డి నాయుడు (Scientist G.D. Naidu) బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కృష్ణ కుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా టైటిల్ ప్రకటించని ఈ మూవీని వర్గీస్ మూలన్ పిక్చర్స్‌కు చెందిన వర్గీస్ మూలన్ అండ్ విజయ్ మూలన్, అలాగే ట్రైకలర్ ఫిలిమ్స్‌కు చెందిన ఆర్. మాధవన్, సరితా మాధవన్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’(Rocketry: The Numby Effect) అనే చిత్రంతో ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్(ISRO scientist Nambi Narayanan) జీవితాన్ని పరిచయం చేశాడు మాధవన్. ఈ సినిమాకు గాను 2022లో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. ఇప్పుడు ఈయన జి..డి నాయుడు బయోపిక్‌తో వచ్చేందుకు సిద్ధం కావడంతో ఫ్యాన్స్‌తో పాటు, సినీ లవర్స్ కూడా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

తాజాగా ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కార్యక్రమం కూడా ఎంతో గ్రాండ్‌గా జరిగింది. ఇందులో ప్రియమణి(Prayamani), జయరామ్(Jayaram), యోగి బాబు(Yogibabu) తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రంపై మరో ఇంట్రెస్టింగ్ బజ్ నెట్టింట వైరల్ అవుతోంది. జి.డి నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతోన్న ‘జి.డి.ఎన్’ చిత్రంలో టైటిల్ రోల్‌లో మాధవన్ నటిస్తుండగా.. ఫీమేల్ లీడ్‌లో శివానీ రాజశేఖర్‌(Shivani Rajashekhar)ను ఫిక్స్ చేశారట మేకర్స్. రాజశేఖర్-జీవితల కుమార్తెగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శివానీ నటన పరంగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ, హీరోయిన్‌గా రాణించలేకపోయింది. ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ‘జి.డి.ఎన్’ చిత్రంలో నటించే చాన్స్ శివానీ దక్కించుకుందని తెలుస్తుండటంతో.. ఆల్ ది బెస్ట్.. ఈ సినిమాతో నీకు మంచి గుర్తింపు రావాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.



Next Story