ఆ కేసుతో నాకు సంబంధం లేదు : ఇఫ్లూ ఫ్రొఫెసర్

దిశ, వెబ్‌డెస్క్ : భీమా కోరేగావ్ కేసుతో తనకు సంబంధం లేకపోయినా NIA అధికారులు తనకు నోటీసులు ఇచ్చారని IFLU ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. అందులో తన పాత్ర లేకపోయినా విచారణకు హాజరుకావాలని NIA అధికారులు తనకు నోటిసులు ఇవ్వడం చాలా బాధకరమన్నారు. విరసం నేత వరవరరావు తనకు మామ అవుతారని కానీ, అతనితో ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు.

2018లో పుణె పోలీసులు అదే కేసు విషయమై తన ఇంట్లో సోదాలు చేశారని, అయినా ఏమీ లభ్యం కాలేదని ఈ సందర్భంగా సత్యనారాయణ వెల్లడించారు. పోలీసులు కావాలనే తననే వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన వాపోయారు.

Advertisement