శ్రీకాళహస్తిలో దారుణ ఘటన 

దిశ, వెబ్ డెస్క్: చట్టాల్ని సైతం లెక్కచేయకుండా పుట్టింది ఆడపిల్ల అని తెలిస్తే ముళ్ల పొదల్లో, చెత్త కుప్పల్లో పడేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. చిత్తూరులో గురువారం ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

శ్రీకాళహస్తి పట్టణంలోని ఏరియా హాస్పిటల్ బాత్రూం వద్ద అప్పుడే పుట్టిన పసికందును గుర్తుతెలియని వ్యక్తులు వదిలేసి వెళ్ళిపోయారు. వివరాల కోసం వైద్య సిబ్బంది ఆరా తీస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించినట్టు తెలుస్తోంది.

Advertisement