కరోనాలో పరీక్ష లేకుండా గుర్తించగల కొత్త లక్షణం ఇదే!

by sudharani |
కరోనాలో పరీక్ష లేకుండా గుర్తించగల కొత్త లక్షణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్ 19 లక్షణాలు, సాధారణ జలుబు లక్షణాలు ఒకే విధంగా ఉండటంతో ఎవరికి వచ్చిందని స్పష్టత కోసం డాక్టర్లు అందరికీ పరీక్షలు చేయాల్సివస్తోంది. దీంతో ఖర్చు, సమయం రెండూ వెచ్చించాల్సి వస్తోంది. అలాగే ఈ వ్యాధి భయంకరంగా వ్యాప్తి చెందుతుండటంతో ఏ చిన్న లక్షణాన్ని కూడా తేలికగా తీసుకునే అవకాశం లేదు. అంతేకాకుండా వ్యాధినిరోధక శక్తి అధికంగా ఉన్న వాళ్లలో చాలా రోజులకు గానీ వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు. దీంతో వారి వల్ల ఎక్కువ మందికి సోకుతోంది. అయితే ఇలాంటి వాళ్లలో కంటికి కనిపించే ఒక అరుదైన లక్షణాన్ని స్పెయిన్ వైద్యులు కనిపెట్టారు.

సాధారణంగా కంటికి కనిపించే లక్షణాలు కరోనాను గుర్తించడానికి ఉపయోగపడవు. అయితే స్పానిష్ జనరల్ కౌన్సిల్ ఆఫ్ పొడియాట్రిస్ట్ కాలేజెస్ వారు విడుదల చేసిన నివేదిక ప్రకారం కరోనా సోకిన వాళ్ల అరికాళ్లలో ఊదా రంగు బొబ్బలు, నొప్పి తెలియని పుండ్లు కనిపిస్తాయని చెప్పారు. చికెన్ పాక్స్, మీజిల్స్ వంటి వ్యాధుల్లో ఇలాంటి బొబ్బలు వచ్చి తెలియకుండానే మానిపోతాయి. అచ్చంగా అలాంటివే కరోనా సోకిన వారిలో కూడా కనిపించాయని ఈ నివేదికలో పేర్కొన్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఏ లక్షణాలు కనిపించని వారిలో కూడా ఈ లక్షణం కచ్చితంగా కనిపిస్తుందని తెలిపింది. దీంతో కరోనా వ్యాధి పాజిటివ్ కేసులను గుర్తించడంలో ఇది సులభమైన లక్షణంగా ఉపయోగపడబోతోందని స్పానిష్ వైద్యులు తెలిపారు.

Tags – corona, covid, new symptoms, lesions on feet, lockdown, positive, negative, kits, cost effective

Advertisement

Next Story

Most Viewed