- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విరహ వేదనలో 'పాగల్' ప్రేయసి..
దిశ, సినిమా : ‘ఈ నగరానికి ఏమైంది, ‘ఫలక్‌నుమా దాస్, ‘హిట్’ సినిమాలతో సక్సె్స్ అందుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం ‘పాగల్’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రాన్ని బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తుండగా నరేష్ కొప్పిలి దర్శకుడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టైటిల్ సాంగ్‌కు మంచి స్పందన లభించగా.. తాజాగా ‘ఆగవే.. నువ్వు ఆగవే.. పోయే ఊపిరే నువ్వు ఆపవే!’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని విడుదల చేసింది మూవీ యూనిట్.
రధన్ మ్యూజిక్ డైరెక్షన్‌లో పాపులర్ సింగర్ సిధ్ శ్రీరామ్ పాడిన పాట సంగీతాభిమానులను కట్టిపడేస్తోంది. అతడి వాయిస్, కృష్ణకాంత్ అందించిన లిరిక్స్, కూల్‌గా వినిపిస్తున్న మ్యూజిక్.. సాంగ్‌ను మరో లెవెల్‌లో నిలబెట్టాయి. రిలీజైన కొద్ది క్షణాల్లోనే యూట్యూబ్‌లో వైరల్‌గా మారగా, సినిమా ఈ నెల 14న థియేటర్స్‌లో విడుదల కానుంది.
- Tags
- Pagal