- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐ20కు అనూహ్య స్పందన!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన సంస్థ హ్యూండాయ్ మోటార్ ఇండియా సరికొత్త తీసుకొచ్చిన హ్యూండాయ్ ఐ20 మోడల్‌కు అనూహ్యమైన స్పందన వస్తోందని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ మార్కెట్ లోకి విడుదల చేసిన కేవలం 40 రోజుల్లోనే 30 వేలకుపైగా బుకింగ్‌లను సాధించిందని కంపెనీ సోమవారం ప్రకటించింది. సరికొత్త హ్యూండాయ్ ఐ20 కోసం ఈ ఏడాది అక్టోబర్ 28న కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. అనంతరం ఈ మోడల్ కారు మార్కెట్‌లో విడుదలయ్యే సమయానికి 10 వేల బుకింగ్‌లను సాధించింది.
నవంబర్ 5న కొత్త ఐ20 విడుదల తర్వాత మరో 20 వేల బుకింగ్‌లు జరిగాయని కంపెనీ సోమవారం వెల్లడించింది. సరికొత్త హ్యూండాయ్ ఐ20 మోడల్‌ను కంపెనీ మొత్తం నాలుగు వేరియంట్‌లలో అందిస్తుండగా, అవి మాగ్నా, స్పోర్ట్జ్, ఆస్టా, ఆస్టా(ఓ). ఆశ్చర్యకరంగా కొత్త ఐ20 కోసం వచ్చిన బుకింగ్‌లలో 85 శాతం టాప్ మోడల్ ఆస్టా కోసం చేసుకున్నారని కంపెనీ పేర్కొంది. హ్యూండాయ్ నుంచి వచ్చిన ఈ సరికొత్త ఐ20 మార్కెట్ లోకి తీసుకొచ్చిన మూడో తరం మోడల్. ఈ కారుని కంపెనీ కొత్త స్టైలింగ్‌తో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించింది.
కొత్త హ్యూండాయ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌తో వస్తోంది. ఇందులో 5 స్పీడ్ మ్యానువల్, 6 స్పీడ్ సీవీటీ ఆటోమెటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తోంది. డీజిల్ వెర్షన్ స్టాండర్డ్ 6 స్పీడ్ మ్యానువల్ ఆప్షన్‌తో వస్తుందని కంపెనీ తెలిపింది. కాగా, హ్యూండాయ్ ఇప్పటివరకూ 10 వేల యూనిట్లను కస్టమర్లకు డెలివరీ చేసినట్టు వెల్లడించింది. పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వీలైనంత తొందరగా ఉత్పత్తిని వేగవంతం చేస్తూ మరిన్ని ఐ20 మోడళ్లను అందిస్తామని హ్యూండాయ్ తెలిపింది.