దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా.. కొత్త కేసులెన్నంటే?

by vinod kumar |
corona, india
X

దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులు క్రితం దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,40,842 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,65,30,132కి చేరింది. కొత్తగా 3,741 మంది వైరస్ బారినపడి మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 2,99,266కి పెరిగింది. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో ఇది 2.08 శాతంగా ఉంది. ఇండియాలో తాజాగా 3,55,102 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,34,25,467కి చేరింది. రికవరీ రేటు 88.3 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 28,05,399 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్న దేశవ్యాప్తంగా 21,23,782 టెస్టులు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 32 కోట్ల 86 లక్షల 07 వేల 937 టెస్టులు చేశారు. కొత్తగా 16,04,542 మందికి వ్యాక్సిన్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed