- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరోసారి బీసీకే బీజేపీ పట్టం
దిశ, కరీంనగర్
రాష్ట్ర కమల దళాధిపతిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ను ఆ పార్టీ అధిష్ఠానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయన నియామకాన్ని ఖరారు చేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
బండి సంజయ్‌కుమార్ ప్రొఫైల్
పేరు: బండి సంజయ్‌కుమార్
పుట్టిన తేదీ: 11-7-1971
తల్లిదండ్రులు: శకుంతల, బండి నర్సయ్య
సామాజిక వర్గం: మున్నూరుకాపు (బీసీ – డి)
భార్య: బండి అపర్ణ (ఎస్‌బీఐ ఉద్యోగి)
పిల్లలు: సాయి భగీరథ్, సాయి సుముఖ్
ప్రస్తుత బాధ్యత: కరీంనగర్ ఎంపీ
బాల్యం నుంచీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌తో బండి సంజయ్‌కు అనుంబంధం ఉంది. అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్‌లో వివిధ స్థాయిల్లో పనిచేశారు. ఆ తర్వాత బీజేవైఎంలో చేరారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా, ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. బీజేవైఎం కేరళ, తమిళనాడు ఇన్‌ఛార్జిగా కూడా వ్యవహరించారు. బీజేపీ జాతీయ కార్యాలయంలో ఢిల్లీ ఎన్నికల ప్రచార ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. ఎల్‌కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. రెండుసార్లు కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా ఘన విజయం సాధించారు.
Tags: bjp, telangana, new state president bandi sanjay kumar, profile