- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలో తొలిసారి.. ఆటోమేటెడ్ కారులో బేబీకి జన్మనిచ్చిన లేడీ
దిశ, ఫీచర్స్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ ‘టెస్లా’లో ఆటోపైలట్ మోడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ ఫీచర్‌తో కారు తనంతట తానే డ్రైవ్ చేసుకోగలదు. అయితే ఎవరైనా డ్రైవర్ సీటులో కూర్చున్నప్పుడు మాత్రమే ఈ ఫీచర్‌ను ఉపయోగించాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే చాలా మంది డ్రైవర్ల ప్రాణాలు కాపాడిన ఈ ఫీచర్.. తాజాగా ఒక మహిళ తన బిడ్డను ప్రసవించేందుకు సాయపడింది.
ఇరాన్ షెర్రీ.. తమ 3 ఏళ్ల కొడుకును భర్త కీటింగ్ షెర్రీతో కలిసి కారులో ప్రీ-స్కూల్‌కు తీసుకెళ్తుండగా నొప్పులు మొదలయ్యాయి. అదే సమయంలో తమ కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ఎటూ కదల్లేని స్థితి నెలకొంది. ఆ పరిస్థితుల్లో సమీప ఆస్పత్రికి వెళ్లడం కష్టమని గ్రహించారు. వెంటనే ఆమె భర్త తమ టెస్లా కారును ఆటోపైలట్ మోడ్‌లో ఉంచి, ఇంకా 20 నిమిషాల దూరంలో ఉన్న ఆస్పత్రికి నావిగేషన్ సిస్టమ్‌ను సెట్ చేశాడు. ఓవైపు తన భార్యకు సాయపడుతూనే మరో చేతిని ముందు జాగ్రత్తగా స్టీరింగ్‌పై వేశాడు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కారు ముందు సీట్లోనే ఇరాన్ తన ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరు ఆస్పత్రికి చేరుకునేలోపే డెలివరీ కాగా.. కారు ముందు సీటుపై బొడ్డు తాడు తెగిపోయింది. ఈ మేరకు ప్రపంచంలోనే మొదటిసారి ఆటోమేటెడ్ కారులో పుట్టిన ‘టెస్లా బేబీ’గా ఆ శిశువు రికార్డు సృష్టించింది.
ఈ సంఘటనపై స్పందించిన ఇరాన్.. ఇలా కారులో ప్రసవించాలనుకోవడం బాధాకరమైన నిర్ణయమని చెప్పింది. టెస్లా కారు ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడు డెస్టినేషన్ చేరుకునే సమయాన్ని గమనిస్తూ.. ప్రసవించాలా లేదా ఆస్పత్రి వచ్చేవరకు ఆపుకోవాలా? అనే సందిగ్ధాన్ని అనుభవించానని.. చివరకు తట్టుకోలేక ప్రసవించానని ఆమె చెప్పుకొచ్చింది. అదృష్టవశాత్తు తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక తమ కుమార్తెకు ‘టెస్’ అనే పేరును పరిశీలించిన ఈ జంట.. తర్వాత ‘మేవ్ లిల్లీ’ అని నిర్ణయించుకున్నారు. కాగా టెస్లా కారులో ఆటోపైలట్ మోడ్‌ను కల్పించిన టెస్లా ఇంజనీర్లకు కీటింగ్ షెర్రీ దంపతులు ధన్యవాదాలు తెలిపారు.