నిన్ను మర్చిపోని రోజంటూ లేదు: రషీద్ ఖాన్

by Shyam |   ( Updated:2021-06-17 21:41:42.0  )
నిన్ను మర్చిపోని రోజంటూ లేదు: రషీద్ ఖాన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్గానిస్తాన్ స్పిన్ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌‌ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్‌లల్లో రాణించడంతో భారత అభిమానులు, ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ ప్రియులకు మరింత చేరువయ్యాడు. ఈ నేపథ్యంలోనే రషీద్‌ను ఫాలో అవుతున్న సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియాలో నేడు సంతాపం తెలియజేస్తున్నారు. ఎందుకంటే రషీద్ పెట్టిన ఓ భావోద్వేగ పోస్టు ఇందుకు కారణం.

‘నా తల్లి చనిపోయి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం.. మీరు ఇకపై మాతో లేరన్న విషయాన్ని నా హృదయం ఇప్పటికీ అంగీకరించడంలేదు. నేను నిన్ను మర్చిపోని రోజంటూ లేదు.. ఈ నొప్పి నుంచి ముందుకు సాగడం నా వల్ల కావడం లేదు’.. అంటూ భావోద్వేగ పోస్టు పెట్టాడు రషీద్. ఇదే సమయంలో తన విజయాల్లో తల్లి ప్రార్థనలు భాగమని గుర్తుచేసుకున్నాడు. కాగా, గతేడాది ఇదే రోజున రషీద్ తల్లి ధీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతూ.. ఆరోగ్యం క్షీణించి మృతి చెందిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed