అడ్డంగా బుక్కైన కేటీఆర్… బట్టబయలైన ఫొటోల గుట్టు

by Anukaran |   ( Updated:2021-09-24 05:06:06.0  )
ktr twitter
X

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అడ్డంగా బుక్కయ్యారు. రెండు ఫొటోలను జోడిస్తూ ఆయన చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ ఫొటోల గుట్టు బట్టబయలు చేశారు నెటిజన్లు. అంతేకాదు మంత్రి హోదాలో ఉండి తప్పుడు సమాచారం ఎలా ఇస్తారంటూ ట్విట్టర్ వేదికగా కడిగిపారేస్తున్నారు.

కాగా, కేటీఆర్ తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతాలో రెండు ఫొటోలను జోడించి ఆశా వర్కర్ల గురించి ఈరోజు (శుక్రవారం) ఓ ట్వీట్ చేశారు.

“Two pics; one from Khammam District & the other from Rajanna Siricilla district 👇 Whats common to both pictures is the commitment level of our healthcare workers 👏And the farm revolution ushered in Telangana under the able leadership of Hon’ble KCR Garu 🙏”

ట్వీట్ సారాంశం ఏంటంటే ఈ రెండు ఫొటోలు ఖమ్మం జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లాకి సంబంధించినవి. ఈ రెండు ఫొటోల్లో కామన్ గా కనిపిస్తున్న విషయమేంటంటే.. హెల్త్ వర్కర్స్ నిబద్ధత, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో వ్యవసాయ విప్లవం ప్రారంభమైంది.

KTR Twitter

ఇందులో కేటీఆర్ ని వివాదంలోకి నెట్టేంత విషయం ఏముంది అనుకుంటున్నారా. అయితే ఓసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రెండు రోజుల క్రితం ట్విట్టర్లో చేసిన పోస్ట్ చూడాల్సిందే. ఆయన చేసిన ట్వీట్.. “రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ పై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉద్యోగులందరిలో స్ఫూర్తి నింపుతున్నారు. వైద్యారోగ్య సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉద్యమంలా సాగుతోంది. అని ఓ ఫొటోని జత చేశారు. అయితే, విజయ సాయి రెడ్డి ట్వీట్ చేసిన ఫోటో… కేటీఆర్ ట్వీట్ చేసిన ఫొటో ఒకటే అవడంతో నెటిజన్లు అవాక్కయ్యారు. కేటీఆర్ పై మండిపడుతూ వరుస ట్వీట్స్ చేస్తున్నారు.

vijayasaireddi twitter

Advertisement

Next Story

Most Viewed