భర్తపై కేసు.. పూనమ్ సూపర్ ప్లాన్!

by  |
భర్తపై కేసు.. పూనమ్ సూపర్ ప్లాన్!
X

దిశ, వెబ్‌డెస్క్: హాట్ మోడల్, హీరోయిన్ పూనమ్ పాండే వివాహం రహస్యంగా జరిగిపోయింది. సెప్టెంబర్ 11న సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న పూనమ్.. 12 రోజులకే భర్తపై కేసు పెట్టింది. సౌత్ గోవాలోని కెనాకొన గ్రామంలో పూనమ్ షూటింగ్‌లో పాల్గొనగా.. సామ్ తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడని.. ఆ తర్వాత తనపై భయంకరమైన దాడి కూడా చేశాడని గోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్‌ బాంబేను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా, పూనమ్ భర్తకు గోవా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 20 వేల పూచీకత్తుపై గోవా ఫస్ట్ క్లాస్ జుడిషియల్ మెజిస్ట్రేట్ షనూర్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే బాలీవుడ్ నిర్మాత, ఎడిటర్, డైరెక్టర్ అయిన సామ్ బాంబేను పెళ్లి చేసుకున్న 12 రోజుల్లోనే తనపై కేసు పెట్టడం అనేది పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని అంటున్నారు నెటిజన్లు. నిజంగా పూనమ్ మంచి పథకం వేసిందని.. వివాహం చేసుకున్న కొద్ది రోజులకే భర్తను అరెస్ట్ చేయించిన తను.. త్వరలో 498A సెక్షన్ కింద డబ్బు కూడా డిమాండ్ చేస్తుందని విమర్శిస్తున్నారు.


Next Story

Most Viewed