- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రేజీ ‘లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్’ ట్రైలర్..
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ హీరోల లైఫ్ ఎలా ఉంటుంది.. బిజీ బిజీ కదా. మరి వారి వైఫ్స్ లైఫ్ ఎలా ఉంటుంది..చిల్ కదా. చెప్పాలంటే.. భర్తలు సంపాదిస్తుంటే భార్యలు ఆ డబ్బులు ఖర్చు పెట్టే పనిలో ఉంటారు. షాపింగ్, కిట్టీ పార్టీ అంటూ ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేస్తారు. ఇది స్టార్స్ వైఫ్స్ గురించి జనాల అభిప్రాయం. మరి ఈ అభిప్రాయం నిజమా కాదా అనే కాన్సెప్ట్‌తో వస్తున్న నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ లివ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్.
సోహైల్ ఖాన్ భార్య సీమ ఖాన్, సంజయ్ కపూర్ సతీమణి మహీప్ కపూర్, చంకీ పాండే వైఫ్ భావన, సమీర్ సోనీ స్పౌస్ నీలం కొఠారిల కథనే సిరీస్ స్టోరీ. ఆ నలుగురే ఈ స్టోరీలో నటించారు. 25 ఏళ్ల స్నేహం కొనసాగిస్తున్న వీరి స్టోరీ..లైఫ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్‌గా వస్తుండగా ట్రైలర్ అదిరిపోయింది.
మహిప్ కపూర్ డైలాగ్‌తో ట్రైలర్ స్టార్ట్ కాగా, ‘మనవి గ్లామరస్ జీవితాలు అని ప్రజలకు అపోహ ఉంది.. కానీ, అది నిజం కాదు.. మన జీవితాలు ప్రాపంచికమైనవి.. అఫ్ కోర్స్ మనం రోల్స్ రాయ్స్‌లో షాపింగ్ వెళ్తాం..మరో ట్రాన్స్‌పోర్టేషన్ సౌకర్యం లేదు కదా..’ అన్న డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. ఇక షారుఖ్ ఖాన్‌తోపాటు వైఫ్ గౌరీ ఖాన్ కూడా గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న ఈ సిరీస్ నవంబర్ 27 నుంచి ప్రసారం కాబోతుంది.
సిరీస్ ట్రైలర్‌పై మిక్స్డ్ టాక్ వస్తోంది. కొందరు డైలాగ్స్, స్టార్ వైఫ్స్ ఫ్రెండ్ షిప్, గాసిప్స్ ఎంజాయ్ చేస్తుంటే..కొందరు మాత్రం ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ చాలా మంది ఉండగా.. ఈ చెత్త స్టోరీతో ఎందుకు వస్తున్నారని నెట్‌ఫ్లిక్స్‌ను ప్రశ్నిస్తున్నారు.
Just added a new thing to our bucket list:
– Go shopping with the gang in a Rolls-Royce 😛 #FabulousLives @maheepkapoor @neelamkothari @seemakkhan @bhavanapandey @dharmatic_ @apoorvamehta18 @aneeshabaig #UttamDomale pic.twitter.com/tURLa6wz1M— Netflix India (@NetflixIndia) November 13, 2020