- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
5 శాతం పెరిగిన నెస్లె ఇండియా లాభాలు
దిశ, వెబ్‌డెస్క్: 2020-21 ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లె ఇండియా నికర లాభం 14.6 శాతం వృద్ధితో రూ. 602 కోట్లకు చేరుకుందని మంగళవారం తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 525.43 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. అలాగే, ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 8.9 శాతం పెరిగి రూ. 3,600 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో నెస్లె ఇండియా దేశీయ అమ్మకాల విలువ 10.17 శాతం పెరిగి రూ. 3,442.03 కోట్లుగా నమోదైనట్టు తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నెస్లె కార్యకలాపాల ఆదాయం రూ. 3,610.82 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
ఈ త్రైమాసికంలో కంపెనీ ఎగుమతుల అమ్మకాలు 12.9 శాతం క్షీణించి రూ. 158.17 కోట్లుగా నమోదయ్యాయి. ‘కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చడంతో కంపెనీ రెండంకెల వృద్ధిని సాధించేందుకు క్లిష్టంగా మారిందని’ నెస్లె ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ్ చెప్పారు. సంస్థ ఈ ఆర్థిక సంవత్సరం బలమైన పనితీరును కొనసాగించింది. దీంతో దేశీయ అమ్మకాల్లో 66 శాతం పెరిగిందని ఆయన తెలిపారు. కీలకమైన ముడిసరుకుల ధరలు పెరుగుతుండటం తమకు సవాలుగా మారుతోందని సురేష్ నారాయణన్ వెల్లడించారు. 2021 క్యాలెండర్ ఏడాదికి నెస్లె బోర్డు డైరెక్టర్లు ఈక్విటీ షేర్‌కు రూ. 25 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.