పార్లమెంట్‌ను రద్దు చేసిన ప్రధాని

by Anukaran |
పార్లమెంట్‌ను రద్దు చేసిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. నేపాల్ పార్లమెంట్‌ను ప్రధాని కేపీ శర్మ ఓలి రద్దు చేశారు. ఆదివారం ఉదయం సమావేశమైన కేబినెట్ పార్లమెంట్ రద్దును ఆమోదించింది. రద్దు నిర్ణయాన్ని నేపాల్ ప్రెసిడెంట్‌కు కేబినెట్ పంపింది. కాగా, కేబినెట్ నిర్ణయాన్ని నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ తప్పుబట్టింది. కేబినెట్ నిర్ణయం ప్రజాస్వామ్య విరుద్ధమని విపక్షనేతలు విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయంతో దేశం తిరోగమనంలోకి వెళ్తుందని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ అధికార ప్రతినిధి నారాయణకాజీ శ్రేష్ట అన్నారు.

Advertisement

Next Story