- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
డేటింగ్ యాప్స్‌లో ఆ హీరోయిన్ హల్‌చల్.. పార్ట్‌నర్స్‌ను అట్రాక్ట్ చేసేందుకా?

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘ఆఫత్-ఎ-ఇష్క్’ ట్రైలర్ సూపర్బ్ రెస్పాన్స్ అందుకుంది. డేటింగ్ యాప్స్ బేస్ చేసుకుని వచ్చిన ఈ సిరీస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నేహా.. తను కూడా రియల్ లైఫ్‌లో డేటింగ్ యాప్స్ యూజ్ చేసినట్లు తెలిపింది. కానీ.. పార్ట్‌నర్‌ను ఎంచుకునేందుకు మాత్రం కాదని, కేవలం ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకునేందుకని వెల్లడించింది. ఈ యాప్ ద్వారా ప్రేమను కనుగొనడం గొప్ప విషయమన్న నేహా.. సెలబ్రిటీలకు అలాంటి అదృష్టం లేదని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ ప్రజలకు తమ గురించి ముందే డీటెయిల్స్ తెలిసి ఉంటాయని, దీంతో తమతో డేట్ చేసేందుకు ఎవరూ ముందుకురారని వివరించింది. ఇక అక్టోబర్ 29న జీ5లో రిలీజ్ కానున్న ‘ఆఫత్ -ఎ-ఇష్క్’ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని తెలిపింది. కాగా ట్రైలర్‌లో డేటింగ్ యాప్ ద్వారా ఎంతమందితో డేటింగ్ చేసింది? పార్ట్‌నర్స్ హత్యకు ఎలా కారణమైందనేది చూపించారు మేకర్స్.