రేపటిపై ఆశతో బతకాలి : నీతూ

by Shyam |
రేపటిపై ఆశతో బతకాలి : నీతూ
X

బాలీవుడ్ నటుడు రిషి కపూర్ మరణంతో ఒంటరైపోయారు ఆయన సతీమణి నీతూ కపూర్. అయినా సరే, ఎన్ని కష్టాలొచ్చినా స్ట్రాంగ్‌గా ఉండాలని.. ఈ జనరేషన్‌కు మంచి సందేశం ఇస్తూ పోస్ట్ పెట్టారు. పెద్దదో, చిన్నదో ప్రతీ ఒక్కరం మన ఆలోచనలతో యుద్ధం చేస్తామని తెలిపారు. విలాసవంతమైన సౌకర్యాలతో కూడిన పెద్ద ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా హ్యాపీగా ఉండలేకపోతున్నామన్న నీతూ.. ఇదంతా మన మైండ్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. వీటన్నిటినీ అధిగమించాలంటే బలమైన ఆలోచన, రేపటి మీద ఆశ ఉండాలని సూచించారు. కృతజ్ఞతతో జీవిస్తూ కష్టపడి పని చేయాలన్నారు. మీకు ప్రియమైన వారిని ప్రేమిస్తూ హ్యాపీగా ఉండాలని సూచించారు.

https://www.instagram.com/p/CB9mEOQgT0F/?igshid=1x7k523opf1pl

ఏప్రిల్ 30, 2020లో రిషి కపూర్ క్యాన్సర్ తో పోరాడుతూ మరణించగా.. భర్త దూరమై రెండు నెలలు అవుతుండడంతో స్మరించుకున్నారు నీతూ. ప్రేమించి పెళ్లి చేసుకున్న బెటర్ హాఫ్ చనిపోయినా తను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు.. చిన్న చిన్న కష్టాలకే మీరెందుకు బలహీనం అవుతున్నారని మెసేజ్ ఇచ్చింది నీతూ.

Advertisement

Next Story

Most Viewed