కరోనాతో అమెరికాలో 40 మంది ఇండియన్ల మృతి

by vinod kumar |   ( Updated:2020-04-12 01:55:51.0  )
కరోనాతో అమెరికాలో 40 మంది ఇండియన్ల మృతి
X

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాను కరోనా వణికిస్తున్నది. గడచిన 24 గంటల్లో 2108 మంది కొవిడ్ 19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ విలయతాండవానికి అమెరికాలోని భారతీయులు బలవుతున్నారు. అమెరికాలో ఉద్యోగ, వ్యాపారాలు, చదువుల నిమిత్తం లక్షలాది మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇప్పుడు వీరిపై కూడా కరోనా పంజా విసురుతోంది. ఇప్పటి వరకు 1,500 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 40 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. అమెరికాలో కరోనాకు కేంద్రంగా మారిన న్యూయార్క్, న్యూజెర్సీ నగరాల్లో భారతీయుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. న్యూయార్క్‌లో 15 మంది, న్యూజెర్సీలో 12 మంది భారతీయులు చనిపోయారని.. వీరిలో ఇద్దరు తెలుగు వాళ్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తున్న సన్నోవా అనలైటిక్స్ కంపెనీ సీఈవో హనుమంతరావు కరోనా బారిన పడి చనిపోయిన్టలు సమాచారం. మరోవైపు కరోనా బారిన పడి చనిపోయిన భారతీయుల్లో గుజరాత్ నుంచి 10, పంజాబ్ నుంచి 4, ఒడిషా నుంచి ఒకరు ఉన్నట్లు తెలుస్తోంది. న్యూజెర్సీలో అత్యధికంగా 400 మంది ఇండో-అమెరికన్లు ఉన్నట్లు అక్కడి అధికారులు చెబుతున్నారు. న్యూయార్క్‌లోని భారతీయ ట్యాక్సీ డ్రైవర్లు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. అమెరికాలో ఉన్న భారతీయుల సమాచారాన్ని సేకరించడానికి ఇప్పటికే విదేశాంగ శాఖ కూడా ప్రయత్నిస్తోంది. కరోనా బారినపడిన వారికి అమెరికా ప్రభుత్వం కూడా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తోంది.

Tags: coronavirus, america, indians, NRI, death, newyork, newjersey

Advertisement

Next Story

Most Viewed