Zelenskyy: రష్యా తదుపరి దాడులను నియంత్రిస్తాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ

by vinod kumar |
Zelenskyy: రష్యా తదుపరి దాడులను నియంత్రిస్తాం.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ
X

దిశ, నేషనల్ బ్యూరో: రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలోకి తమ సైనికులు చొరబడటాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సమర్థించాడు. రష్యా తదుపరి దాడులను నిరోధించడానికి బఫర్ జోన్‌ను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. సాధ్యమైనంతగా రష్యా యుద్ధ సామర్థ్యాన్ని నాశనం చేస్తామన్నారు. ప్రతిఘటనా చర్యలను చేపట్టి రష్యా భూభాగంలో బఫర్ జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సోమవారం ఆయన ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ప్రతి దిశలో ఉక్రెయిన్ దళాలు అత్యుత్తమంగా పని చేస్తున్నాయన్నారు. మా భాగస్వామ్య దేశాల నుంచి ఆయుధాలు వేగంగా సరఫరా చేయాలని పిలుపునిచ్చారు. యుద్ధంలో సెలవులు ఉండబోవని, వాగ్దానం చేసిన సహాయ ప్యాకేజీలను సకాలంలో అందించాల్సిన అవవసరం ఉందన్నారు.

అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ప్రత్యేకించి కోరుతున్నట్టు చెప్పారు. ఈ యుద్ధాన్ని సక్రమంగా ముగించడానికి మద్దతు ఇచ్చే వారి సంఖ్యను విస్తరిస్తామన్నారు. ఉక్రెయిన్ మునుపటి కంటే బలంగా ఉందని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పరిస్థితి, కుర్స్క్ ప్రాంతంలో కార్యకలాపాలపై కమాండర్-ఇన్-చీఫ్ సిర్‌స్కీ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఉక్రెయిన్ సైన్యం ఇటీవల రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలోకి చొరబడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story