- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒడిశా ఘటనపై పాకిస్తాన్ ప్రధాని సహా ప్రపంచ నేతల సంతాపం
దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాదం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది. ఈ ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రైలు ప్రమాదంలో వందలాది మంది మరణించడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నా. ఈ ఘోర విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేస్తున్నాను. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. అలాంటి ఘటన జరగడం దురదృష్టకరం’అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ప్రమాద ఘటన పట్ల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తన తరఫున, తమ దేశ ప్రజల తరఫున రైలు ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. ‘భారతదేశంలోని ఒడిశాలో రైలు ప్రమాదం యొక్క చిత్రాలు, నివేదికలు నా హృదయాన్ని కలిచివేశాయి. ఈ క్లిష్ట సమయంలో కెనడియన్లు భారతదేశ ప్రజలకు అండగా నిలుస్తున్నారు’ అని మృతులకు కుటుంబాలకు సంతాపం తెలిపారు. కాగా, ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 300 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వెయ్యి మందికిపైగా క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇవి కూడా చదవండి: