Rajnath Singh: ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు

by Shamantha N |
Rajnath Singh: ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌ గాంధీపై (Rahul Gandhi)కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) నిప్పులు చెరిగారు. భారత్‌- చైనా సరిహద్దు పరిస్థితి గురించి ఆర్మీ చీఫ్ చేసిన ప్రకటనపై రాహుల్‌ స్పందించడాన్ని తప్పుబట్టారు. రాహుల్ తప్పుడు ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. ‘‘ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారు. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై రాహుల్ బాధ్యతారహితంగా మాట్లడటం విచారకరం. ఇలాంటి విషయాలను రాజకీయాలు చేయడం మంచిది కాదు. ఆయన చరిత్రను చదవాలి. దానిపైన అవగాహన పెంచుకోవాలి’’ అంటూ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాహుల్‌ గాంధీ.. భారత్‌ భూభాగాలు, మేకిన్‌ ఇండియా గురించి ప్రస్తావించారు. ‘‘చైనా బలగాలు మన భూభాగంలో ఉన్నాయనే విషయాన్ని ప్రధాని మోడీ ఖండించారు. కానీ, దీనిపై ఆర్మీ చీఫ్ వాస్తవాలు మాట్లాడారు. చైనా బలగాలు మన భూభాగంలో ఉన్నాయని ఆయన అన్నారు’’ అని రాహుల్‌ అన్నారు. మోడీ (PM Modi) చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ విఫలం కావడం వల్లే బీజింగ్‌ నుంచి వస్తువులు దేశంలోకి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.

గల్వాన్ ఘర్షణ తర్వాత..

2020 గల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి ప్రతిష్టంభన నెలకొంది. ఆ తర్వాత చర్చల తర్వాత ఎల్ఏసీ వెంబడి పెట్రోలింగ్ ను తిరిగి ప్రారంభించిన రెండు నెలల తర్వాత జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇకపోతే, భారత్‌, చైనా దళాలు వాస్తవాధీన రేఖ వద్ద గస్తీ కొనసాగిస్తున్నాయి. ఇటీవల ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 2020 నాటి పరిస్థితిని పునరుద్ధరించారు. అంతేకాకుండా, ఒప్పందంతో కీలక ప్రాంతాలైన దెప్సాంగ్‌, దెమ్‌చోక్‌లో ఇరు దేశాలు బలగాలు ఉపసంహరణ పూర్తయ్యింది.

Advertisement
Next Story

Most Viewed