- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓడితే మాకేం.. హామీ నెరవేర్చాల్సిందే.. రూ.లక్ష స్కీమ్ కోసం కాంగ్రెస్ ఆఫీస్ వద్ద మహిళల క్యూ
దిశ, డైనమిక్ బ్యూరో: ఇండియా కూటమి గెలిస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి కుటుంబంలోని ఒక మహిళ ఖాతాలో ఏడాదికి రూ.1లక్ష చొప్పున నగదు జమ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇండియా కూటమి ఓడినా ఎన్నికల హామీ మేరకు ఏడాదికి రూ.లక్ష ఇవ్వాల్సిందేనని యూపీలో మహిళా ఓటర్లు డిమాండ్ చేస్తున్నారు. నిన్న వెలువడిన ఫలితాల్లో ఉత్తరప్రదేశ్‌లో మిత్రపక్షాలైన సమాజ్‌వాది పార్టీ 37, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఇండియా కూటమి కంటే తక్కువ సీట్లు వచ్చినా కేంద్రంలో ఎన్డీయేకు 293 సీట్లు రావడంతో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టునుంది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం పలువురు మహిళలు లక్నోలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు క్యూలో నిలబడి ఎన్నికల ప్రచార సమయంలో హామీ ఇచ్చిన ‘గ్యారంటీ కార్డులు’ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే గ్యారెంటీ కార్డులు పొందిన కొంతమంది తమ ఖాతాల్లో రూ.లక్ష జమ చేయాలని ఆ ఫామ్‌లను పార్టీ కార్యాలయంలో సమర్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా హామీలు నెరవేర్చాలని అడగటం ఏంటని ఈ సంగతి తెలిసిన వారు చర్చించుకుంటున్నారు.