కాంగ్రెస్ లేకుంటే అసోం సీఎంకు గుర్తింపే లేదు: జైరాం రమేశ్ విమర్శలు

by samatah |
కాంగ్రెస్ లేకుంటే అసోం సీఎంకు గుర్తింపే లేదు: జైరాం రమేశ్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసోం సీఎం హిమంత బిస్వశర్మపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే బిస్వశర్మకు గుర్తింపే లేదని తెలిపారు. శనివారం ఆయన ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడారు. పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన వారిలో హిమంత ఒకరని చెప్పారు. ‘మాజీ సీఎం తరుణ్‌ గొగోయ్‌ హయాంలో కాంగ్రెస్‌ హిమంతకు అధికారం, బాధ్యతలు ఇచ్చింది. అయితే అధికారంలో లేనప్పుడు ఆయన పార్టీకి ద్రోహం చేశారు. పదవులు అవకాశవాదంగా మారాయి’ అని వ్యాఖ్యానించారు. కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ సత్రాలు అని భావించే వారంతా మళ్లీ హస్తం గూటికి చేరుతారు’ అని చెప్పారు. అసోంలో యువకులు, శక్తిమంతులు, అనుభవజ్ఞులైన అభ్యర్థులను కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో నిలబెట్టిందన్నారు. భారత్ భిన్నత్వంతో కూడిన భూమి అని, దానిని కాపాడుకోవడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. కాంగ్రెస్ పై ఒత్తిడి తెచ్చేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందని, కానీ వాటన్నింటినీ తట్టుకుని అధికారంలోకి వస్తామని దీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed