కాంగ్రెస్‌పై బహిస్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు

by S Gopi |
కాంగ్రెస్‌పై బహిస్కృత నేత ఆచార్య ప్రమోద్ కృష్ణం సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పార్టీ వ్యతిరేక వ్యాఖ్యల కారణంగా బహిష్కరణకు గురైన ఆచార్య ప్రమోద్ కృష్ణం ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. 'తనను బహిష్కరించినందుకు పార్టీకి కృతజ్ఞతలు. నా జీవితాంతం ప్రధాని నరేంద్ర మోడీకి అండగా ఉంటాను' అని అన్నారు. ఇదే సమయంలో తనను ఆరేళ్లకు బదులుగా 14 సంవత్సరాలు బహిష్కరించాల్సిందని, రాముడు సైతం 14 ఏళ్లు వనవాసంలో ఉన్నారని ఆయన కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన కారణంతో తనను బహిష్కరించినట్టు ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ లేఖలో పేర్కొన్నారని, విముక్తి కల్పించినందుకు తానే కృతజ్ఞతలు చెబుతున్నాను. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డానో చెప్పాలని' ప్రమోద్ కృష్ణం తెలిపారు. రాముడి పేరుని ప్రస్తావించడం, అయోధ్యకు వెళ్లడం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలా అంటూ ప్రశ్నించారు. రాముడి విషయంలో తాను ఎన్నడూ రాజీపడనని, ఇప్పుడు తానొక స్వేచ్ఛా జీవినని ఆచార్య ప్రమోద్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed