- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Amit Shah: జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తాం
దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల(Jharkhand Assembly Elections 2024) ప్రచారంలో ఎన్డీయే, ఇండియా కూటములు దూసుకుపోతున్నాయి. రాంచీలో ఈ రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Amit Shah) బీజేపీ మేనిఫెస్టో సంకల్ప్ పత్ర(Sankalp Patr)ను ఆవిష్కరించారు. ఛత్రా జిల్లా సిమారియాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. జేఎంఎం కూటమి రాజకీయ లబ్ది కోసం నక్సలిజాన్ని(Naxalism) ప్రోత్సహిస్తున్నదని, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చికల్లా మావోయిస్టుల ముప్పును పూర్తిగా తుడిచిపెడుతుందని(Eradicate) పేర్కొన్నారు. జార్ఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి(Uniform Civil Code)ని ప్రవేశపెడుతామని, అయితే, గిరిజనులను యూసీసీ నుంచి మినహాయిస్తామని వివరించారు. ఇతరుల కోటా ప్రభావితం కాకుండా ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. గోగో దీదీ స్కీమ్ ద్వారా ప్రతి సోదరి నెలకు తన ఖాతాలో రూ. 2,100 డబ్బులు పొందుతారని, ప్రతి నిరుద్యోగికి రూ. 2,000 నిరుద్యోగభృతి అందిస్తుందని వివరించారు. రాష్ట్రంలోని జేఎంఎం కూటమి ప్రభుత్వం, దళిత, పేద, యువత వ్యతిరేక ప్రభుత్వమని, ఈ కూటమిని ఇంటికిపంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవినీతికి పాల్పడిన నాయకులందరినీ విచారిస్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు జార్ఖండ్ అభివృద్ధికి, అవినీతిరహిత పాలనకు, భూమి, భుక్తి, ఆడపిల్లలను రక్షించుకోవడానికి వచ్చిన అవకాశమని వివరించారు. జార్ఖండ్‌లో మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, మహిళకు రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
పింఛన్ పెంచుతాం: జేఎంఎం
జార్ఖండ్‌లో జేఎంఎం సారథ్యంలోని కూటమి అధికారంలోకి వస్తే రేషన్ కార్డుపై ప్రస్తుతమిస్తున్న ఐదు కిలోల బియ్యానికి బదులు ఏడు కిలోల బియ్యం ఇస్తామని పార్టీ చీఫ్, రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించారు. పింఛన్‌నూ పెంచుతామని హామీ ఇచ్చారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో 11 లక్షల రేషన్ కార్డులు, మూడు లక్షల పింఛన్లను రద్దు చేశారని, అందుకే దళితులు, అనేక గిరిజన ప్రజలు ఆకలితో మరణించారని ఆరోపించారు. అదే తమ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరికీ రేషన్ బియ్యం, పింఛన్, వారికి దక్కాల్సిన మొత్తంలో పౌష్టికాహారాన్ని అందిందని వివరించారు. అలాగే, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి బయటికి నెట్టివేయబడ్డ 10 లక్షల మంది బాధితులకు తిరిగి రేషన్ బియ్యం అందిస్తామని తెలిపారు. మాయ్యా సమ్మాన్ యోజనా కింద మహిళలకు నెలకు రూ. 2,500 అందిస్తామని, అగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఫలాలు, గుడ్లు అందిస్తామని వివరించారు.