- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
New CEC:నూతన సీఈసీగా జ్ఞానేష్ కుమార్..!

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (CEC) ఎవరనే దానిపై ఉత్కంఠ కొనగాసుతోంది. కొత్త సీఈసీని ఎంపిక చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. కాగా.. కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్ పేరు ఖరారయ్యే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ పదవి కోసం కేంద్రం ఓ జాబితాను సిద్దం చేయగా.. అందులో జ్ఞానేష్ కుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 1988 బ్యాచ్‌కి చెందిన కేరళ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జ్ఞానేష్ కుమార్ వయస్సు 61 సంవత్సరాలు. కాగా.. ముగ్గురు సభ్యుల ప్యానల్ లోని ఇద్దరు కమిషనర్లోల ఆయన సీనియర్, అదీకాక కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఆయన చాలా క్లోజ్ అనే ఓ చర్చ సైతం సాగుతోంది.
ఎవరీ జ్ఞానేష్ కుమార్?
జ్ఞానేష్ కుమార్.. గతంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో కీలక శాఖలను పర్యవేక్షించారు. 2019, ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు ముసాయిదా బిల్లుని రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో హోం మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కశ్మీర్ డివిజన్‌ను ఆయన పర్యవేక్షించారు. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా అయోధ్యలోని రామమందిరంకు సంబంధించిన పత్రాల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. ఇక గతేడాది సహకార మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆయన పదవీ విరమణ చేశారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ వాఖలో కార్యదర్శిగా పని చేశారు. కాన్పూర్‌లోని ఐఐటీ నుంచి బీటెక్ డిగ్రీ పొందిన జ్ఞానేష్ కుమార్ ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి బిజినెస్ ఫైనాన్స్‌లో పట్టా పొందారు. అదేవిధంగా హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పర్యావరణ ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ సంపాదించారు.ఇకపోతే, జ్ఞానేష్ కుమార్ కు సీఈసీ పదవి దక్కితే.. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాదిలో నిర్వహించే బిహార్ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు, అసోం, తమిళనాడు ఎన్నికలు కూడా జ్ఞానేష్ కుమార్ హయాంలోనే జరగనున్నాయి.