- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బడ్జెట్‌పై ప్రముఖులు ఏమన్నారంటే..
దార్శనికతతో కూడిన బడ్జెట్: అమిత్ షా
కేంద్ర బడ్జెట్‌ను హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సమ్మిళిత, దార్శనికతతో కూడిన బడ్జెట్‌గా అభివర్ణించారు. 2023-24 బడ్జెట్ ప్రతి విభాగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వావలంబన భారతదేశాన్ని నిర్మించాలనే మోదీ ప్రభుత్వ సంకల్పానికి మరింత ఊపునిస్తుందని ట్వీట్ చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి మూలధన వ్యయాన్ని 10 లక్షల కోట్ల(33 శాతానికి)కు పెంచడం, ద్రవ్య లోటును 5.9 శాతం వద్ద ఉంచడం అభినందనీయమని అన్నారు. ఇది బలమైన మౌలిక సదుపాయాలు, ఆర్థిక వ్యవస్థతో దేశాన్ని నిర్మించాలనే మోడీ ప్రభుత్వ ముందు చూపును ప్రతిబింబిస్తుందని తెలిపారు.
నూతన భారత్‌కు విజన్‌లా బడ్జెట్: ఆదిత్యనాథ్
కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ నూతన భారత్‌కు విజన్ అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. తాజా బడ్జెట్ రైతులు, యువత, మహిళలు, పేదలతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నేరవేర్చుతుందని అన్నారు. భారత్ ఆర్థికంగా సూపర్ పవర్‌గా మారుతుందని ఈ బడ్జెట్ నిరూపిస్తుందని పేర్కొన్నారు.
సవతి తల్లిలాగా వ్యవహరిస్తోంది: కేజ్రివాల్
కేంద్రం తీసుకొచ్చిన నూతన బడ్జెట్‌పై ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తీవ్రంగా స్పందించారు. తాజాగా దేశ రాజధానికి రూ. 325 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయడంపై ఆయన కేంద్రాన్ని దుయ్యబట్టారు. కేంద్రం వ్యవహారం సవతి తల్లిలాగా ఉందని అన్నారు. గతేడాది పన్ను రూపంలో రూ.1.75 లక్షల కోట్లు ఢిల్లీ ప్రజలు చెల్లిస్తే కేవలం రూ. 325 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. బడ్జెట్ ద్వారా ద్రవ్యోల్బణం పెరుగుతుందని అన్నారు. నిరుద్యోగాన్ని తొలగించేందుకు ఎలాంటి ప్రణాళికలు కూడా కనిపించలేదని చెప్పారు.
పేదల కోసం కాదు.. ఎన్నికల కోసమే..: మల్లిఖార్జున్ ఖర్గే
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్‌లో పేదల కోసం ఏమి లేదని, ఎన్నికల ప్రసంగంలా ఉందని విమర్శించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ను రూపొందించారని ఆరోపించారు. కేంద్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించలేకపోయిందని, ఈ బడ్జెట్ సామాన్యులది కాదని అన్నారు. ఉద్యోగాల భర్తీ, ఉపాధి హామీ విషయాల్లో నిరాశే ఎదురైందని చెప్పారు.
దేశ భవిష్యతును నిర్మించే రోడ్ మ్యాప్ లేదు- బడ్జెట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు
కేంద్రం తీసుకొచ్చిన బడ్జెట్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. దేశ భవిష్యతును నిర్మించేందుకు ఎలాంటి ముందు మార్గం లేని మిత్ర కాల్ బడ్జెట్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు. 'ఈ బడ్జెట్‌లో ఉద్యోగ కల్పనపై ఎలాంటి విజన్ లేదు. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే ప్రణాళిక లేదు. అసమానతను అరికట్టే ఉద్దేశం లేదు. 40 శాతం సంపద ఒక్క శాతం ధనికుల చేతుల్లో ఉంది. 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ కడుతున్నారు. 42 శాతం యువత ఇంకా నిరుద్యోగులుగా ఉన్నారు. ప్రధానికి ఇవేం పట్టింపు లేవు. ఈ బడ్జెట్ దేశ భవిష్యతును నిర్మించడానికి ఎలాంటి రోడ్ మ్యాప్‌ను నిరూపించలేదు' అని ట్వీట్ చేశారు.
ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ : మమతా బెనర్జీ
కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. తాజా బడ్జెట్ పూర్తి ప్రజా వ్యతిరేకమని, అవకాశవాదంతో కూడుకున్నదని దుయ్యబట్టారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ పై దృష్టి పెట్టిందని ఆరోపించారు. ఈ బడ్జెట్ నిరుద్యోగ సమస్యను పక్కన పెట్టిందని అన్నారు.
మిడిల్ క్లాస్ బొనాంజా: స్మృతి ఇరానీ
మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్ మిడిల్ క్లాస్ బొనాంజా అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. సమ్మిళ వృద్ధి గురించి ప్రధాని ప్రస్తావించారని బడ్జెట్ లోనూ అదే కనిపించిందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, వృద్ధులు అందరికీ కావాల్సినవి ఇందులో ఉన్నాయని చెప్పారు.
ప్రతికూల బడ్జెట్‌తో ప్రజలను వంచించింది: చిదంబరం
కేంద్రం ప్రతికూల బడ్జెట్‌తో ప్రజలను వంచించిందని మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో నిరుద్యోగం, దరిద్రం, అసమానత వంటి పదాలను బడ్జెట్ లో ప్రస్తావించలేదని విమర్శించారు. అయితే ఆశ్చర్యకంగా పేదరికం అనే పదాన్ని రెండు సార్లు ప్రసంగంలో వాడారని అన్నారు. ప్రభుత్వాన్ని గమనిస్తున్న దేశ ప్రజలు దీనిని గుర్తు పెట్టుకుంటారని అన్నారు. కొత్త పన్నులు తప్ప ఎలాంటి పన్ను తగ్గింపు లేదని నొక్కి చెప్పారు. దేశంలోని బిలియనీర్లకే ఈ బడ్జెట్ తో ప్రయోజనం ఉందని, సామాన్యుడికి లేదని ఆరోపించారు.
సంక్షేమం, సబ్బిడీకి దూరంగా బడ్జెట్: ముఫ్తీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ విమర్శలకు దిగారు. తాజా బడ్జెట్‌లో సంక్షేమం, సబ్సిడీని కేంద్రం పక్కన పెట్టిందని విమర్శించారు. పన్నులు పెరుగుతున్నప్పటికీ, ఎలాంటి సంక్షేమ, సబ్సిడీలపై ఖర్చు చేయట్లేదని అన్నారు. పన్నులతో ప్రజలకు ప్రయోజనం జరగాల్సి ఉండగా, వారి నడ్డి విరుగుతుందని పేర్కొన్నారు.
పన్ను తగ్గింపులు స్వాగతిస్తాను: కార్తీ చిదంబరం
కేంద్రం బడ్జెట్‌లో పన్ను మినహాయింపులపై చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. 'నేను తక్కువ పన్ను విధానాన్ని నమ్ముతాను. కాబట్టి, పన్ను తగ్గింపులను స్వాగతిస్తాను. ఎందుకంటే ప్రజల చేతుల్లోకి ఎక్కువ డబ్బు ఇవ్వడం ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఉత్తమ మార్గం' అని అన్నారు.
- Tags
- Budget 2023