JP Nadda: బెంగాల్‌లో అన్ని వర్గాలకు వ్యతిరేకంగా మమతా పాలన

by S Gopi |
JP Nadda: బెంగాల్‌లో అన్ని వర్గాలకు వ్యతిరేకంగా మమతా పాలన
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఘాటు విమర్శలు చేశారు. ఆదివారం సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం మహిళలకు, యువతకు, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మారిందని అన్నారు. సీఎం మమతా బెనర్జీ దోచుకుంటున్న వారికి అధ్యక్షత వహిస్తూ రాష్ట్ర ప్రజలను పాలించడంలో విఫలమయ్యారని విమర్శించారు. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా తాజా వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా పాలన అన్ని వర్గాలకు వ్యతిరేకిగా సాగుతోందని, మురికి ఉన్న ఇనుముగా మారిందని, ఇటీవలి ఘటనలు అది పూర్తిగా తుప్పు పట్టిన తీరులో ఉందని విమర్శించారు.

Advertisement

Next Story