- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan : 'సల్మాన్ ఖాన్‌ను చంపడం ఖాయం'
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపడం ఖాయమని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ చెప్పాడు. తనను చంపుతామని తన స్నేహితుడికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిందంటూ సల్మాన్ ఖాన్ మార్చి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కెనడాలో అండర్ గ్రౌండ్‌లో ఉన్న గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ఓ న్యూస్ ఛానెల్‌కు సోమవారం ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘మేం హత్య చేసే జాబితాలో సల్మాన్ ఖాన్ ఉన్నాడు’ అని చెప్పడం విశేషం. గతేడాది మే నెలలో హత్యకు గురైన పంజాబీ గాయకుడు, రాజకీయవేత్త సిద్ధూ మూసేవాలా మర్డర్‌కు గోల్డీ బ్రార్ సూత్రధారిగా ఆరోపణలున్నాయి. ‘సల్మాన్ ఖాన్‌ను క్షమించబోనని భాయి సాహెబ్ (లారెన్స్) చెప్పాడు. అతను కనికరం చూపినప్పుడే బాబా దయ చూపుతాడు. మేము సల్మాన్ ఖాన్‌ను కచ్ఛితంగా చంపుతాం’ అని గోల్డీ బ్రార్ చెప్పాడు.
సల్మాన్ ఖాన్‌ను చంపడమే తన జీవిత లక్ష్యమని జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని గోల్డీ బ్రార్ ఈ సందర్భంగా ప్రస్తావించడం విశేషం. ‘మేము ముందు చెప్పినట్లు.. సల్మాన్ ఖాన్ ఒక్కరి గురించి మాత్రమే కాదు. మేం బతికి ఉన్నంత కాలం మా శత్రువులందరినీ వేటాడుతూనే ఉంటాం. ఇప్పుడు సల్మాన్ ఖాన్ మా టార్గెట్. ఈ విషయంలో సందేహాలకు తావులేదు. సల్మాన్‌ను చంపే ప్రయత్నాల్లో ఉన్నాం. మేం సక్సెస్ అయినప్పుడు ఆ విషయం మీకు తెలుస్తుంది’ అని గోల్డీ బ్రార్ కుండబద్దలు కొట్టాడు.
లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై కేసు నమోదు..
సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈ-మెయిల్ పంపించిన గ్యాంగ్‌స్టర్లు లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్‌లపై ముంబై పోలీసులు మార్చి నెలలో కేసు నమోదు చేశారు. ‘మీ బాస్ (సల్మాన్ ఖాన్)తో గోల్డీ బ్రార్ మాట్లాడాలనుకుంటున్నాడు. అతను (సల్మాన్ ఖాన్) తప్పనిసరిగా బిష్ణోయ్ ఇంటర్వ్యూ చూసి ఉండాలి. అతను ఆ ఇంటర్వ్యూ చూడకుంటే చూసేలా చేయండి. సమస్యను పరిష్కరించాలనుకుంటే అతనితో (గోల్డీ బార్‌తో) మాట్లాడే అవకాశం ఇవ్వండి. అతను (సల్మాన్ ఖాన్) ముఖాముఖి మాట్లాడాలనుకుంటే మాకు చెప్పండి. ఇప్పుడు మీకు మెయిల్ చేశాం. మా తదుపరి చర్య మిమ్మల్ని షాక్‌కు గురి చేస్తుంది’ అంటూ సల్మాన్ ఖాన్ సన్నిహితుడు ప్రశాంత్ గుంజాల్కర్‌కు మార్చి నెలలో బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది.
- Tags
- salman khan