Army chief: చైనా- పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?

by Shamantha N |
Army chief: చైనా- పాక్ సంబంధాలపై ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా, పాకిస్థాన్‌ (China-Pakistan) మద్య కుట్రపూరిత సంబంధాలున్నాయని ఆర్మీ చీఫ్‌ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Chief of Army Staff General Upendra Dwivedi) సంచలన కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని భారత్ (India) తప్పక అంగీకరించాలన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ద్వివేది మాట్లాడుతూ.. ‘‘వర్చువల్ డొమైన్‌లో ఆ రెండు దేశాల మధ్య బంధం వందశాతంగా ఉంది. భౌతికంగా పరిశీలిస్తే.. చైనాలో తయారైన మిలిటరీ ఉత్పత్తులను పాక్‌ వాడుతోంది. రెండువైపుల నుంచి యుద్ధ ముప్పు ఉందనేది వాస్తవం. అలాగే వేసవి సమీపిస్తున్నకొద్దీ జమ్మూకశ్మీర్‌లో చొరబాట్లు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే పరిస్థితి లేనేలేదు. సరిహద్దుల వెంబడి చొరబాట్లు తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఉగ్రవాదుల కదలికలు పెరిగే అవకాశం ఉన్నందున భారత్‌ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని ద్వివేది వెల్లడించారు.

ఉగ్రవాద కట్టడిపై

మరోవైపు, ఉగ్రవాద కట్టడికి భారత సైన్యం గట్టి చర్యలు తీసుకుంటోందని జనరల్ ద్వివేది చెప్పారు. ఈవిషయంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు తెలిపారు. 2018 నుంచి ఉగ్రవాద ఘటనల సంఖ్య 83 శాతం తగ్గాయన్నారు. కేవలం 45 మంది మాత్రమే ఉగ్ర కార్యకలాపాల వైపు ఆకర్షితులయ్యారని చెప్పారు. సైన్యం చర్యలతో జమ్ముకశ్మీర్ దృష్టిని ఉగ్రవాదం నుంచి పర్యటకం పెరిగిందన్నారు. గతేడాది పట్టుబడిన ఉగ్రవాదుల్లో 60 శాతం మంది పాకిస్థాన్ మూలానికి చెందిన వారని అన్నారు. భారత్ పొరుగుదేశాల నుంచి నిరంతరం ముప్పుని ఎదుర్కొంటుందని నొక్కి చెప్పారు. అయితే, పొరుగు దేశం పాకిస్థాన్ ఉగ్రవాదం వల్ల బాధపడుతోందన్నారు. ఆ దేశం తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోందన్నారు. జమ్ముకశ్మీర్ నుంచి ఆర్మ్ డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్(AFSPA) తొలగింపు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదన్నారు. స్థానిక పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించగలరని సైన్యం విశ్వసించిన తర్వాత ఆ యాక్ట్ నిరద్దు చేయవచ్చని ఆయన నొక్కి చెప్పారు. భవిష్యత్ యుద్ధాల విషయానికొస్తే స్నేహితులకు మార్చగలిగినప్పటికీ.. పొరుగువారిని మార్చలేరని అన్నారు. భారత్ ఐదు తరాల యుద్ధంతో స్థిరపడిందని అన్నారు. అంతేకాకుండా అగ్నివీర్ పథకం గురించి ఆయన స్పందించారు. ఈ పథకం విజవంతమవుతోందని దేశానికి హామీ ఇవ్వగలనని చెప్పుకొచ్చారు.

Next Story