Quad Summit: భారత్-జపాన్ మధ్య 2027 నాటికి 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యం: జైశంకర్

by S Gopi |
Quad Summit: భారత్-జపాన్ మధ్య 2027 నాటికి 42 బిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యం:  జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2047 నాటికి 42 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో భారత్-జపాన్ మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలపడనున్నాయని విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు కోసం జపాన్‌ పర్యటనలో ఉన్న ఆయన ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను ప్రముఖంగా ప్రస్తావించారు. విలేకరుల సమావేసంలో మాట్లాడిన జైశంకర్.. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భారత్-జపాన్ సంబంధాలు గత 10 ఏళ్లలో గణనీయంగా పెరిగాయి. పదేళ్లలో మేము సగటున 8 కొత్త విమానాశ్రయాలు నిర్మించాం. ఏటా 2 కొత్త మెట్రోలు, ప్రతిరోజూ 2 కిలోమీటర్ల హైవేలు, 8 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌లను వేస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా భారత్‌లో 1,600 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఏడాదికి 100 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఎగుమతులను కలిగి ఉన్నామని చెప్పారు. మూడు దశాబ్దాల భారత్-జపాన్ సంబంధాల్లో తనకు ఎంతో అనుభవం ఉంది. 2017లో ప్రారంభమైన క్వాడ్ కంటే ముందు 2007 నుంచి నాకు ఇరు దేశాల మధ్య సంబంధాలు తెలుసు. ముఖ్యంగా 2014 నుంచి సంబంధాలు బలపడ్డాయి. దేశంలో గణనీయంగా జపాన్ పెట్టుబడులు ఉన్నాయి. 1,400 వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాలని భావిస్తున్నాం. భారత్ సైతం జపాన్‌లో పెట్టుబడులను పెంచాలని కోరుకుంటోందన్నారు. భవిష్యత్తులో 2047 నాటికి భారత్‌లో జపాన్ 42 బిలియన్ డాలర్ల పెట్టుబడుల లక్ష్యం సాధ్యమవుతుందని జైశంకర్ వెల్లడించారు.

భారత్‌లో సెమీకండక్టర్లు, ఈవీ, అంతరిక్షం, డ్రోన్లు, గ్రీన్ ఎనర్జీ లాంటి కొత్త రంగాల్లో సామర్థ్యం అధికంగా ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అనేక అభివృద్ధి చెందిన ఆర్థికవ్యవస్థల నుంచి భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని జైశంకర్ వివరించారు. ఇదే సమయంలో ఈ ఏడాది చివర్లో భారత్ తదుపరి క్వాడ్ సమ్మిట్‌ను నిర్వహించాలని, 2025లో అమెరికా క్వాడ్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుందని ఆయన పేర్కొన్నారు. కాగా, టోక్యోలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జపాన్ విదేశాంగ మంత్రులు యోకో కమికావా, ఆస్ట్రేలియా పెన్నీ వాంగ్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పాల్గొన్నారు.

Next Story

Most Viewed