- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
బంగ్లాదేశ్‌లో హింస.. హిందూ మైనార్టీలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి జైశంకర్
దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ లో విపరీతంగా పెరిగిపోయిన హింస కారణంగా ఆ దేశ ప్రధాని రాజీనామా చేసింది. దీంతో ప్రస్తుతం బంగ్లాలో సైనిక పాలన నడుస్తోంది. అయినప్పటికి హింస చెలరేగుతూనే ఉంది. గంట గంటకు బంగ్లాలో ఉన్న బారతీయులుపై, హిందూ మైనార్టీలపై జరుగుతున్న దాడులపై భారత ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. ఈ క్రమంలోనే పార్లమెంట్ లో అఖిలపక్ష మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో పాటే దేశంలోని పలు పార్టీల నాయకులు, విదేశాంగ మంత్రి జైశంకర్, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా ప్రధాని మోడీ పాల్గొన్నారు. అనంతరం బంగ్లా పరిస్థితులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రధాని మోడీకి వివరించారు.
ఈ సందర్భంగా జయశంకర్ మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ హింసపై ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడని.. తెలిపారు. అలాగే బంగ్లాలో అల్లర్లు ప్రారంభం అయినప్పటి నుంచి 8 వేల మంది విద్యార్థులు తిరిగి భారత్ చేరుకున్నారని తెలిపారు. దీంతో పాటుగా బంగ్లాదేశ్ లో ఉన్న భారతీయులను తరలించాల్సిన అవసరం లేదని.. అక్కడ మైనార్టీలుగా ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులపై కొత్త ప్రభుత్వం ఏర్పడగానే చర్చిస్తామన్నారు. అలాగే మైనార్టీలుగా ఉన్న హిందువుల ఇల్లు, ఆలయాలపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకుంటామని జైశంకర్ చెప్పుకొచ్చారు. కాగా ఈ రోజు సాయంత్రం బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.