Haryana Elections: వినీశ్ ఫోగట్ ఎన్నికల్లో నా పేరు సహకారంతో గెలిచింది: బ్రిజ్ భూషణ్

by Mahesh |   ( Updated:2024-10-08 12:07:37.0  )
Haryana Elections: వినీశ్ ఫోగట్ ఎన్నికల్లో నా పేరు సహకారంతో గెలిచింది: బ్రిజ్ భూషణ్
X

దిశ, వెబ్ డెస్క్: హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతుంది. ఇప్పటికే మేజార్టీ స్థానాల్లో విజయం సాధించి.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హర్యానాలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయింది. కాగా ఆ రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతుల పేరుతో నిరసనలు నిర్వహించారు. ఈ నిరసనలు పలువురు రెజ్లర్లు కూడా సంఘీభావం తెలిపిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. హర్యానా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించారని అన్నారు. ఎన్నికలకు ముందు, ఎన్నికల సమయంలో రెజ్లర్ల ఆందోళనలో ఉన్న రెజ్లర్లు హర్యానా హీరోలు కాదని.. వారంతా జూనియర్ రెజ్లర్లందరికీ కూడా విలన్‌ లని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన వినీశ్ ఫోగట్ నా పేరును గెలిపించిందని.. ఆమె గెలవడానికి సహకరించిన గొప్ప వ్యక్తిని నేను అని.. ఆమె నా పేరును ఉపయోగించుకునే విజయం సాధించింది.. కానీ కాంగ్రెస్ ఓడిపోయింది అని.. సెటైర్లు వేశారు.

Advertisement

Next Story

Most Viewed