- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలో చేరిన బాక్సర్ విజేందర్ సింగ్
by S Gopi |
X
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ బాక్సర్, బాక్సింగ్‌లో భారత్‌కు తొలి ఒలింపిక్ పతకాన్ని అందించిన విజేందర్ సింగ్ బుధవారం బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని ఎదుర్కొన్న విజేందర్, ఈసారి నటి, ప్రస్తుత ఎంపీ హేమ మాలినిపై మధుర నుంచి పోటీకి దిగుతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ అనూహ్యంగా ఎన్నికలకు ముందు పార్టీని వీడటం ఆశ్చర్యం. ప్రజలు ఎక్కడ కోరుకున్నా పోటీకి సిద్ధంగా ఉన్నానని విజేందర్ సింగ్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. హర్యానాలో రాజకీయంగా అధిక ప్రభావం కలిగిన జాట్ కమ్యూనిటీ నుంచి విజేందర్ సింగ్ వచ్చారు.
Advertisement
Next Story