- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Uttarakhand: కేదార్ నాథ్ యాత్రపై బీజేపీ ఎమ్మెల్యే వివదాస్పద వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశా నౌటియాల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేదార్‌నాథ్ ఆలయంలోకి హిందువులు కాని వారి ప్రవేశాన్ని పరిమితం చేయాలన్న వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కొందరు హిందువులు కాని వ్యక్తులు మతపరమైన స్థలం పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. "కేదార్‌నాథ్ ధామ్ ప్రతిష్టను దెబ్బతీసేలా కొందరు వ్యక్తులు ఏదైనా చేస్తుంటే, వారి ప్రవేశాన్ని నిషేధించాలి. హిందువులు కానివారు బయటి నుండి వచ్చి ధామ్‌ను పవిత్రతను దెబ్బతీసే ఇటువంటి కార్యకలాపాలలో పాల్గొనే వారిని గుర్తించాలి" అని ఆమె అన్నారు. కేదార్ నాథ్ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు మాంసం, చేపలు వండుతున్నారా.. మద్యం తాగుతున్నారా అని అడిగినప్పుడు, సరైన దర్యాప్తు తర్వాత మాత్రమే దీన్ని గుర్తించగలమని అన్నారు. ఈ విషయంపై ఇటీవలే మంత్రి సౌరభ్ బహుగుణ స్థానికులు, అధికారులతో సమావేశం నిర్వహించారని చెప్పుకొచ్చారు. సమావేశంలో పాల్గొన్న కొందరు.. హిందూయేతర వ్యక్తులు కేదార్‌నాథ్ ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని సూచించారని అన్నారు. అలాంటి వ్యక్తులను గుర్తించి ఆ ప్రదేశంలోకి ప్రవేశించకుండా నిరోధించాలని కోరినట్లు తెలిపారు.
బీజేపీపై మాజీ సీఎం విమర్శలు
నౌటియాల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్పందించారు. బీజేపీ నేత వ్యాఖ్లపై విమర్శలు గుప్పించారు. “సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం బీజేపీ నాయకులకు అలవాటు. ఉత్తరాఖండ్ ఒక 'దేవభూమి'.. మీరు ఎంతకాలం ప్రతిదానినీ మతంతో ముడిపెడతారు? ప్రజలకు చెప్పడానికి వారికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని ఫైర్ అయ్యారు.