- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
హమాస్, లష్కరేకు యూఎస్ఎయిడ్ నిధులు

- హమాస్‌కు2 బిలియన్ డాలర్ల సొమ్ము
- లష్కరే సంబంధిత సంస్థకు ఆర్థిక సాయం
- కాంగ్రెస్ విచారణలో వెల్లడి
దిశ,నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థలుగా గుర్తింపు పొందిన వాటికి అమెరికా ఎయిడ్(యూఎస్ఎయిడ్) నిధులు భారీగా అందాయి. బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే భారీగా నిధులను అందించినట్లు ఆ సంస్థ ఉద్యోగులు వెల్లడించారు. యూఎస్ఎయిడ్, ఫెడరల్ కార్మికులపై కాంగ్రెస్ నిర్వహిస్తున్న హౌస్ కమిటీ విచారణ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాద సంస్థ ఇజ్రాయేల్‌పై దాడి చేసింది. ఆ దాడులు జరిగిన తర్వాత నుంచి ఇప్పటి వరకు 2 బిలియన్ డాలర్లకు పైగా నిధులు ఆ సంస్థకు యూఎస్ఎయిడ్ పంపిందని వెల్లడించారు. భారత్‌కు వ్యతిరేకంగా పని చేసే, అమెరికా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించిన ఫలాహ్-ఎ-ఇన్సానియత్(ఎఫ్ఐఎఫ్)కు కూడా భారీగా నిధులు సమకూర్చింది. పాకిస్తాన్‌లోని లష్కర్-ఏ-తొయబా సంస్థకు అనుబంధంగా అమెరికాలో పని చేస్తుంది. ముంబై దాడుల్లో 166 మంది మృతి చెందగా, 300 మంది గాయపడ్డారు. ఈ దాడులకు లష్కర్ ఏ తొయబానే కారణం.
ముంబై దాడులే కాకుండా దేశంలోని పలు దాడులకు లష్కర్ సంస్థ కుట్ర దాడి ఉంది. అమెరికా ప్రభుత్వం నిషేధించినా.. యూఎస్ఎయిడ్ మాత్రం ఎఫ్ఐఎఫ్‌కు భారీగా నిధులు సమకూరుస్తుండటం గమనార్హం. లష్కర్‌తో పాటు దాని అనుబంధ సంస్త జమాత్ ఉద్ దవా సంస్థలు అనేక టెర్రర్ దాడులకు పాల్పడ్డాయి. ఇండియా, అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా జమ్ము కశ్మీర్‌లో ఈ సంస్థ టెర్రరిస్టు దాడులకు పాల్పడుతుంది. కాగా, మిషిగాన్‌లో ఉన్న హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్ (హెచ్‌హెచ్‌ఆర్డీ) అనే చారిటీ సంస్థకు ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ద్వారా యూఎస్ఎయిడ్ నిధులు పంపుతున్నట్లు విచారణలో తేలింది. ఈ హెచ్‌హెచ్ఆర్డీ అనే సంస్థకు దక్షిణాసియాలోని పలు జీహాదీ సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైంది. యూఎస్ఎయిడ్ నుంచి 1,10,000 అమెరికా డాలర్లు జీహాదీ గ్రూపులకు చేరినట్లు తేలింది.
ట్రంప్ రెండో సారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎస్ఎయిడ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న సహాయ కార్యక్రమాల్లో 60 బిలియన్ డాలర్లకు పైగా నిధులను తగ్గించాలని నిర్ణయించారు. అంతేకాకుండా యూఎస్ఎయిడ్ ద్వారా వృథా ఖర్చులు ఎక్కువవుతున్నాయని, 90 శాతం మేర ఈ ఖర్చులను తగ్గించాలని ట్రంప్ అన్నారు.