- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Canada: కెనడా ప్రధాని ఆరోపణలకు అమెరికా మద్దతు
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ హత్య కేసులో అమెరికా కూడా భారత్ కు వ్యతిరేకంగా మారింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలకు అగ్రరాజ్యం మద్దతిచ్చింది. ట్రూడో చేసిన ఆరోపణలు తీవ్రమైనవని.. నిజ్జర్ కేసు దర్యాప్తునకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ కెనడా చేస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. వాటిని భారత్ సీరియస్‌గా తీసుకుని కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. కానీ, బారత్ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకొంది. నేను ఈ అంశంలో ఇరుదేశాలు బహిరంగంగా ప్రకటించిన వాటిపై తప్ప అదనంగా మరేమీ మాట్లాడలేను అని వివరించారు. ఇరుదేశాల మధ్య సహకారం ఉండాల్సిన అవసరముందన్నారు.
భారత్ తో సంబంధాలపై ఏమన్నారంటే?
మరోవైపు భారత్-అమెరికా దౌత్య సంబంధాలపై కూడా మిల్లర్ మరోసారి వ్యాఖ్యానించారు. ఇరుదేశాల బంధఁ బలంగా ఉందన్నారు. ‘‘భారత్ మా శక్తిమంతమైన భాగస్వామిగా కొనసాగుతోంది. సమష్టి లక్ష్యాలు, స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ వంటి పలు అంశాల్లో మేము కలిసి పనిచేస్తున్నాం. ఇరుదేశాలు తమ అభిప్రాయాలను నిరభ్యంతరంగా వ్యక్తంచేసే పరిస్థితి ఉంది’’ అని ఆయన అన్నారు. మరోవైపు, నిజ్జర్ హత్య కేసులో భారత దౌత్యవేత్తలతో సంబంధం ఉందని కెనడా ఆరోపించింది. అలానే, గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధాలున్నాయని చెప్పేందుకు ప్రయత్నించారు. ఆరుగురు కెనడా దౌత్యవేత్తలు ఈ నెల 19 అర్ధరాత్రిలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని, కెనడాలోని భారత దౌత్యాధికారులు స్వదేశానికి వచ్చేయాలని భారత్ ప్రకటించింది.