- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Lucknow: లక్నోలో మహిళా పోలీసు ఇన్‌స్పెక్టర్ కిడ్నాప్
దిశ, నేషనల్ బ్యూరో: తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోలేదనే కారణంతో ఓ వ్యక్తి ఏకంగా మహిళా ఇన్‌స్పెక్టర్‌నే కిడ్నాప్ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఈ ఘటన చోటుచేసుకుంది. కిడ్నాప్ చేసిన అతని నుంచి తప్పించుకున్న సదరు మహిళా ఇన్‌స్పెక్టర్ నిందితుడిపై కొత్త కేసును నమోదు చేశారు. దీని గురించి వివరాలు వెల్లడించిన పోలీసులు.. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అన్షుమాన్ పాండె అనే వ్యక్తి గత ఆరు నెలలుగా లక్నోలోని బాబు బనారసి దాస్ (బీబీడీ) పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా ఇన్‌స్పెక్టర్‌ను వేధిస్తున్నాడు. తనపై గతంలో నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు. అయితే, అతని డిమాండ్‌ను ఆమె పట్టించుకోకపోవడంతో కిడ్నాప్ చేశాడు. తన ఇంటి నుంచే తనను కిడ్నాప్ చేశాడని మహిళా ఇన్‌స్పెక్టర్ తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని బెదిరించినట్టు కూడా ఆమె చెప్పారు. కిడ్నాప్ అనంతరం తనను బిథౌలీ కూడలిలో ఉన్న నిర్జన ప్రదేశంలో వదిలేశాడని, అక్కడి నుంచి పారిపోయి బీబీడీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పాండెపై మరో ఫిర్యాదు చేసినట్టు ఆమె వివరించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నామని, దర్యాప్తు చేపడతామని పేర్కొన్నారు.