UP: యువతిని వారం నిర్బంధించి.. గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ 23 మంది

by Shamantha N |
UP: యువతిని వారం నిర్బంధించి.. గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డ 23 మంది
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో దారుణం జరిగింది. 12వ తరగతి విద్యార్థిని వారం రోజులు నిర్బంధించి 23 మంది లైంగిక వేధింపులకు(student gangraped) పాల్పడ్డారు. మార్చి 29న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12వ తరగతి చదువుతున్న 19 ఏళ్ల విద్యార్థిని స్పోర్ట్స్‌లో పాల్గొనేందుకు రన్నింగ్ ప్రాక్టీస్‌ చేసేందుకు రోజూ కాలేజీలోని గ్రౌండ్ కు వెళుతంది. కాగా, మార్చి 29న రన్నింగ్‌ ప్రాక్టీస్‌ కోసం వెళ్లిన ఆ యువతిని స్నేహితుడు కలిశాడు. పిషాచ్‌మోచన్ ప్రాంతంలోని హుక్కా బార్‌కు ఆమెను తీసుకెళ్లాడు. అక్కడ మరి కొందరు వీరిని కలిశారు. ఈ సందర్భంగా కూల్‌ డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఆమెతో తాగించారు. సిగ్రా ప్రాంతంలోని పలు హోటళ్లకు తీసుకెళ్లి వారం రోజులపాటు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

యువతి కుటుంబం ఫిర్యాదుతో..

అయితే, తమ కుమార్తె కనిపించడం లేదని విద్యార్థిని కుటుంబ సభ్యులు ఏప్రిల్‌ 4న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను అదే రోజున పోలీసులు గుర్తించి కుటుంబానికి అప్పగించారు. అయితే, ఏప్రిల్‌ 6న లాల్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో ఆ యువతి ఫిర్యాదు చేసింది. మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 4 వరకు 23 మంది తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించింది. బాలిక కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుక్కా బార్‌లోని సిబ్బందిని కూడా ప్రశ్నించడం ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఆ ప్రదేశం నుండి సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. నిందితుల్లో కొందరు క్లాస్‌మేట్స్‌, మరికొందరు ఇన్‌స్టాగ్రామ్‌ ఫ్రెండ్స్‌ అని పేర్కొంది. కాగా, యువతి ఫిర్యాదుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. 23 మంది నిందితుల్లో 11 మందిని గుర్తించలేదన్నారు. ఇప్పటివరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ విద్యార్థిని మైనర్‌ బాలిక కాదని అధికారులు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed