సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు..

by Vinod kumar |
సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్టులు..
X

లక్నో : పబ్జీ గేమ్ ఆడుతూ ఉత్తర ప్రదేశ్‌లోని రబుపురా కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తితో ప్రేమలో పడి పాక్ నుంచి ఇండియాకు వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకుంటున్నాయి. సీమ ప్రేమికురాలేనా..? పాకిస్థాన్ గూఢచారా..? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సీమా హైదర్‌ని ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు దాదాపు 20 గంటలపాటు విచారించి ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ప్రకారం.. సీమా హైదర్‌‌పై అనుమానాల కారణంగా పాకిస్థాన్‌కు తిరిగి పంపించే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. "ఇది రెండు దేశాలకు సంబంధించిన విషయం. తగిన ఆధారాలు లభించే వరకు ఏమీ చెప్పలేం" అని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే సీమా.. పాక్ ఐఎస్ఐ ఏజెంట్ ఏమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి. తన సోదరుడు పాకిస్తాన్ ఆర్మీలో చేరాడని.. కానీ అతను మిలటరీలో కొనసాగుతున్నాడో లేదో తనకు తెలియదని దర్యాప్తులో సీమా చెప్పింది.

ఇంగ్లిష్ కూడా ఆమె అద్భుతంగా చదువుతోందని అధికారులు గుర్తించారు. ఇక ఇన్వెస్టిగేషన్‌లో సీమా ఇచ్చిన స్టేట్మెంట్లను నిర్ధారించుకునేందుకు అధికారులు.. ఆమె భర్త గులాం హైదర్‌ను కూడా విచారించారు. మరోవైపు సచిన్‌తో తన ప్రేమాయణం విషయాలకు సంబంధించి.. సీమా హైదర్ అన్నీ చెప్పింది. 2019లో తన భర్త గులాం హైదర్ నుంచి దూరంగా ఉన్నప్పుడు.. అదే సమయంలో సచిన్ మీనాతో స్నేహం ఏర్పడిందని చెప్పింది. తనకు సచిన్ అంటే చాలా ఇష్టమని.. అందుకే పాకిస్థాన్ నుంచి దుబాయ్‌కి.. అక్కడి నుంచి నేపాల్‌కు.. నేపాల్ నుంచి యూపీలోని రబుపురా గ్రామానికి వచ్చానని సీమా హైదర్ చెప్పింది. సీమ పేరిట సచిన్ నకిలీ ఆధార్ కార్డులను తయారు చేశాడని.. వారిద్దరూ బస చేసిన నేపాల్‌లోని హోటల్‌లో తప్పుడు పేరు, చిరునామాను ఇచ్చాడని కూడా దర్యాప్తులో తేలింది. దీంతో సచిన్, సీమ ఇద్దరూ కలిసి ఎన్నో విషయాలు దాచిపెట్టారని వెల్లడైంది.

Advertisement

Next Story

Most Viewed