- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘యూనైటెడ్ అపోజిషన్’ టార్గెట్! ఆ సీఎంతో నితీష్ కుమార్ భేటీ..
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇటీవల బీహార్ సీఎం నితీష్ కుమార్ హాజరయ్యారు. కాగా తాజాగా ఆయన ఆదివారం ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో భేటీ కావడం చర్చనీయాంశమైంది. అంతకుముందు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్రీయ జనతాదల్ లీడర్ మనోజ్ ఝా ఢిల్లీలోని బీహార్ సీఎం నితీష్ ఇంటికి వెళ్లారు. అయితే శుక్రవారం మీడియాతో మాట్లాడిన నితీష్ దేశ వ్యాప్తంగా వస్తున్న డిమాండ్ మేరకు ప్రతిపక్షాలను ఏకంగా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో ఘన విజయం సాధించిన విషయాన్ని ఈ సందర్భంగా నితీష్ కుమార్ గుర్తు చేశారు. ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నామన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా జనతా దల్ (యునైటెడ్) చీఫ్ ప్రతి పక్ష పార్టీల నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో ఓడించడమే లక్ష్యంగా నితీష్ కుమార్ యూనైటెడ్ అపోజిషన్ నినాదాన్ని ఎత్తుకున్నారు. కాగా కర్ణాటకలో ఒకే వేదికపై సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్షాల నేతలు ఒక్కటి కావడం, తాజాగా నితీష్ ఢిల్లీ సీఎంతో భేటీ కావడం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారింది.
Also Read...