అలాంటి వారు బీజేపీలో ఉన్నా ఈడీ విచారణ తప్పదు: అమిత్ షా

by GSrikanth |
అలాంటి వారు బీజేపీలో ఉన్నా ఈడీ విచారణ తప్పదు: అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ న్యూస్ చానల్ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) పనిచేస్తుందని చెప్పారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతలు బీజేపీలో చేరినా వారిపై విచారణ జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరిపైనా కేసులు ఎత్తివేయలేదని చెప్పారు. అనంతరం కాంగ్రెస్‌పై అమిత్‌షా విరుచుకుపడ్డారు.

ఇండియా కూటమి అధికారం అత్యాశతో ఏర్పడిన కూటమని అని చురకలు అంటించారు. కాంగ్రెస్ సొంత వంశాన్ని నియంత్రించలేకపోయిందని, రాహుల్ గాంధీని పదే పదే లాంచ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీకి గెలుపు అలవాటుగా మారిందని అమిత్‌ షా అన్నారు. ఎన్నో పరాజయాల తర్వాత బీజేపీ ఈరోజు ఈ స్థాయికి చేరుకుందని షా అన్నారు.

Advertisement

Next Story

Most Viewed