- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Trump: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు- యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా- ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధంపై మరోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో ఉక్రెయిన్ (Ukraine) ఏదొకరోజు రష్యా (Russia)లో భాగం కావొచ్చు.. కాకపోవచ్చు అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘వారు (రష్యా- ఉక్రెయిన్‌లను ఉద్దేశిస్తూ) ఒప్పందం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. ఉక్రెయిన్‌లు రష్యన్లు కావొచ్చు.. కాకపోవచ్చు’ అని ట్రంప్ అన్నారు. అంతేకాకుండా, ఉక్రెయిన్‌తో 500 మిలియన్ డాలర్ల డీల్‌తో పాటు అరుదైన ఖనిజాల వినియోగం అంశాన్ని గురించి నొక్కిచెప్పారు. ఈ డీల్‌లో భాగంగా కీవ్ అధీనంలోని అరుదైన ఖనిజాలను అమెరికాకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు గ్యాస్‌ను కూడా సరఫరా చేయాల్సివస్తుంది. అమెరికాకు ఖనిజాలు లభిస్తే.. ఆ దేశానికి అవసరమైన వాటిని అగ్రరాజ్యం అందిస్తుంది.
జెలెన్ స్కీతో జేడీ వాన్స్ భేటీ
మరోవైపు, ఈ పోరాటాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్న తన రాయబారి కీత్ కెల్లాగ్‌ను త్వరలో ఉక్రెయిన్ పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) వచ్చేవారం మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ లో జెలెన్‌స్కీతో భేటీ అవుతారని అక్కడి అధికారి తెలిపారు. ఇకపోతే, దాదాపు మూడేళ్లుగా ఉక్రెయిన్- రష్యాల మధ్య యుద్ధం జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే యుద్ధాన్ని ఆపేస్తానని ట్రంప్ చాలా సార్లు పేర్కొన్నారు. అందులోభాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy), రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin)లు శాంతి చర్చలకు రావాలని పిలుపునిచ్చారు. రష్యా చర్చలకు వచ్చేందుకు నిరాకరిస్తే.. ఆంక్షలు విధిస్తానంటూ హెచ్చరికలు సైతం చేశారు.