- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని మోడీ తాత దిగొచ్చినా డీఎంకేను టచ్ చేయలేరు : ఉదయనిధి
by Hajipasha |
X
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర సర్కారుపై తమిళనాడు క్రీడా శాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఫైర్ అయ్యారు. తమిళనాడు రాష్ట్రం పన్ను రూపంలో అందిస్తున్న ప్రతి రూపాయిలో 28 పైసలనే కేంద్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తోందని ఆయన ఆరోపించారు. ఈసందర్భంగా ప్రస్తుత ప్రధానమంత్రి పాలనా తీరును ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘28 పైసా మోడీ’’ అనే పదబంధాన్ని ఉదయనిధి ప్రయోగించారు. తమిళనాడులో డీఎంకేను టచ్ చేసే సత్తా కూడా బీజేపీకి లేదన్నారు. ప్రధాని మోడీ వచ్చే 40 రోజుల పాటు రాష్ట్రంలో ప్రచారం కొనసాగించినా బీజేపీకి ఒక్క లోక్‌సభ సీటు కూడా రాదని చెప్పారు. ‘‘గత 60- 70 ఏళ్లుగా డీఎంకే గురించి చెడుగా చెబుతున్న వారే నశించి పోయారు. ప్రియమైన ప్రధానమంత్రి.. మీరు మాత్రమే కాదు.. మీ తాత దిగొచ్చినా డీఎంకేను ఏమీ చేయలేరు’’ అని ఉదయనిధి స్టాలిన్ కామెంట్ చేశారు.
Advertisement
Next Story