సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో తాపీ నదిలో రెండు పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం

by Disha Web Desk 17 |
సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పుల కేసులో తాపీ నదిలో రెండు పిస్టల్స్, బుల్లెట్లు స్వాధీనం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల బాలీవడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ నివాసం వెలుపల జరిగిన కాల్పుల ఘటనలో మరో అప్‌డేట్ వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు షూటర్లు ఉపయోగించిన ఆయుధాల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతుండగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిలో పురోగతి సాధించారు. గుజరాత్‌లోని తాపీ నది నుండి ఒక పిస్టల్స్, మ్యాగజైన్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం ఒక అధికారి తెలిపారు. సోమవారం ప్రారంభమైన సోదాల్లో ఒక తుపాకీ, అలాగే కొన్ని లైవ్ కాబ్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. రెండో తుపాకీ కోసం గాలింపు చర్యలను మంగళవారం కూడా కొనసాగించగా తాజాగా అది కూడా దొరికింది.

ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడు విక్కీ గుప్తాను తమతో పాటు సూరత్ తాపీ నదికి తీసుకెళ్లారు, అక్కడ తుపాకీని విసిరిన ప్రాంతాన్ని అతను చూపెట్టగా, ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ దయా నాయక్‌తో సహా 12 మంది అధికారుల బృందం ఘటనా స్థలంలో స్కూబా డైవర్ల సహాయంతో సెర్చ్ చేయగా రెండు తుపాకీలను కనిపెట్టారు.

ఏప్రిల్ 14న ముంబైలోని బాంద్రా ప్రాంతంలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ వెలుపల విక్కీ గుప్తా (24), సాగర్ పాల్ (21) అనే ఇద్దరు నిందితులు కాల్పులు జరిపి, తరువాత బైక్‌పై అక్కడి నుండి పారిపోయారు. వారి ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారించగా, నిందితులు కాల్పులకు వాడిన తుపాకీలను ఘటన తర్వాత రైలులో భుజ్‌కు పారిపోతుండగా రైల్వే వంతెనపై నుంచి తాపీ నదిలోకి విసిరినట్లు పోలీసులకు తెలిపారు. దీంతో వాటి కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా రెండు తుపాకీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.



Next Story

Most Viewed