Donald Trump: 30 రోజుల సీజ్ ఫైర్‌కు ఉక్రెయిన్ అంగీకరించింది.. డొనాల్డ్ ట్రంప్

by vinod kumar |   ( Updated:12 March 2025 3:08 PM  )
Donald Trump: 30 రోజుల సీజ్ ఫైర్‌కు ఉక్రెయిన్ అంగీకరించింది.. డొనాల్డ్ ట్రంప్
X

దిశ, నేషనల్ బ్యూరో: సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఉక్రెయిన్ (Ukrein), రష్యా (Russia) యుద్ధంపై అమెరికా ప్రతినిధులు ఉక్రెయిన్‌తో చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ డిస్కషన్‌లో భాగంగా 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించిందని, ఈ ప్రతిపాదనకు రష్యా అంగీకరించాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తెలిపారు. మాస్కో సైతం ఒప్పుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధంలో ఇరు వైపులా సైనికులు, పౌరులు మరణించడం బాధాకరమని, ఈ విషాదాన్ని ఆపాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనికి కాల్పుల విరమణ ఎంతో కీలకమైందని స్పష్టం చేశారు.

ఇరు దేశాల నగరాల్లో పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక మంది ప్రజలు చంపబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దానికి ముగింపు పలికేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తామని చెప్పారు. రష్యాతో కాల్పుల విరమణకు ఒప్పించాలని లేదంటే మరింత బీభత్సం జరిగే ప్రమాదం ఉందని అంచనా వేశారు. త్వరలోనే ఈ అంశంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తోనూ మాట్లాడతానని అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని మరోసారి వైట్ హౌస్‌కు ఆహ్వానిస్తానని స్పష్టం చేశారు. కాగా, గత నెలలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky), అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఇరు వర్గాల మధ్య చర్చలు జరగడం ఇదే తొలిసారి.

Next Story